ప్రజావేదిక స్వాధీనం
చంద్రబాబుకు చుక్కెదురైంది. ప్రజావేదిక భవనం ఇక ఆయనకు దక్కే అవకాశం లేదు. కరకట్టపై నిర్మించిన లింగమనేని అక్రమ భవనంలో నివాసం ఉంటున్న చంద్రబాబు … ఐదు కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రజావేదికను నిర్మించుకున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే తనకు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో కరకట్టపై అక్రమంగా నిర్మించిన లింగమనేని భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అందుకే తాను ముఖ్యమంత్రి హోదాలో అక్కడ నివాసం ఉంటున్నట్టు చెప్పిన చంద్రబాబు… ప్రభుత్వానికి లేఖ […]
చంద్రబాబుకు చుక్కెదురైంది. ప్రజావేదిక భవనం ఇక ఆయనకు దక్కే అవకాశం లేదు. కరకట్టపై నిర్మించిన లింగమనేని అక్రమ భవనంలో నివాసం ఉంటున్న చంద్రబాబు … ఐదు కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రజావేదికను నిర్మించుకున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే తనకు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
గతంలో కరకట్టపై అక్రమంగా నిర్మించిన లింగమనేని భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అందుకే తాను ముఖ్యమంత్రి హోదాలో అక్కడ నివాసం ఉంటున్నట్టు చెప్పిన చంద్రబాబు… ప్రభుత్వానికి లేఖ రాసేటప్పుడు మాత్రం లింగమనేని భవనాన్ని ప్రైవేట్ వ్యక్తుల భవనంగా చూపించారు. రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం తాను అక్కడే ఉంటానని… కాబట్టి పక్కనే ఉన్న ప్రజావేదికను తనకు కేటాయిస్తే పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటానని చంద్రబాబు లేఖలో కోరారు.
దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంతలో ఈనెల 24న జరిగే కలెక్టర్ల సదస్సుకు ప్రజావేదిక భవనాన్ని అధికారులు ఎంపిక చేశారు.
గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు కూడా ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రజావేదిక భవన్ చంద్రబాబుకు ఇక దక్కే సూచనలు లేవు. కలెక్టర్ల సదస్సుకు ప్రజావేదికను తీసుకోవడం అంటే ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టుగానే భావిస్తున్నారు.