Telugu Global
National

చంద్రబాబు చాలా తప్పులు చేసారు " సుజనా చౌదరి

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక తప్పులు చేసారని, ఆ తప్పులపై తాను ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని రాజ్యసభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ తీర్దం పుచ్చుకున్న తెలుగుదేశం నాయకుడు సుజనా చౌదరి అన్నారు. “ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావద్దని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చ చెప్పాను. అయినా ఆయన వినలేదు” అని సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాత ఢిల్లీలో జరిగిన విలేఖరులు సమావేశంలో అన్నారు. […]

చంద్రబాబు చాలా తప్పులు చేసారు  సుజనా చౌదరి
X

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక తప్పులు చేసారని, ఆ తప్పులపై తాను ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని రాజ్యసభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ తీర్దం పుచ్చుకున్న తెలుగుదేశం నాయకుడు సుజనా చౌదరి అన్నారు.

“ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావద్దని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చ చెప్పాను. అయినా ఆయన వినలేదు” అని సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాత ఢిల్లీలో జరిగిన విలేఖరులు సమావేశంలో అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కేంద్రంతో చంద్రబాబు వ్యవహరించిన ఘర్షణ ధోరణే కారణమని సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని సుజనా చౌదరి అన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోదీతో మూడు సంవత్సరాలు కలిసి పనిచేసానని, దేశానికి నరేంద్ర మోదీయే సరైన నాయకుడని భావించానని సుజనా చౌదరి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని కారణాల వల్ల ప్యాకేజీని తీసుకోలేకపోయామని, ఇది పెద్ద తప్పిదమేనని సుజనా చౌదరి అంగీకరించారు.

నేడు ప్రధానితో భేటీ

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి అధికార భారతీయ జనతా పార్టీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.

నలుగురు సభ్యులు సుజానా చౌదరి, టీ.జీ.వెంకటేష్, సిఎం.రమేష్, గరికపాటి ప్రధానిని ఆయన నివాసంలో కలుస్తారు. ప్రధానితో భేటీ అనంతరం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా ఈ నలుగురు నాయకులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

First Published:  20 Jun 2019 8:45 PM GMT
Next Story