Telugu Global
National

బీజెపీ మైండ్ గేమ్ ఆడుతోంది

తెలుగుదేశం పార్టీని అస్థిర పరచడానికి భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని అస్ధిర పరచాలనుకోవడం భారతీయ జనతా పార్టీ నాయకుల భ్రమ అని, తెలుగు రాష్ట్ర్రాలలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు. “మా పార్టీ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా” అని చంద్రబాబు నాయుడు అన్నారు. […]

బీజెపీ మైండ్ గేమ్ ఆడుతోంది
X

తెలుగుదేశం పార్టీని అస్థిర పరచడానికి భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీని అస్ధిర పరచాలనుకోవడం భారతీయ జనతా పార్టీ నాయకుల భ్రమ అని, తెలుగు రాష్ట్ర్రాలలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు.

“మా పార్టీ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా” అని చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, ఇప్పుడు ఎదురైన సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. పార్టీకి చెందిన నలుగురు నాయకులు పార్టీ వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏదీ లేదని అన్నారు.

“ఇప్పుడు పార్టీ మారిన నాయకులు భవిష్యత్ లో పశ్చాత్తాప పడతారు. స్వార్ధ రాజకీయాల కోసం పార్టీ మారిన వారితో మాకు ఎలాంటి నష్టం ఉండదు” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ కష్ట కాలంలో కార్యకర్తలే అండగా ఉన్నారని, ఇప్పుడు కూడా వారి అండదండలతోనే పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ తో చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు పార్టీ మారడాన్ని పార్టీ నాయకులందరూ తీవ్రంగా ఖండించాలని, ఎక్కడికక్కడ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి చర్యను ఖండించాలని సూచించారు.

పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ కు నారా లోకేష్ కూడా ఫోన్ చేసి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసారట. పార్టీ మారిన వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

First Published:  21 Jun 2019 1:50 AM IST
Next Story