Telugu Global
NEWS

ప్రపంచకప్ లో... 714 పరుగులతో ప్రపంచ రికార్డు...

ఆస్ట్రేలియా- బంగ్లా మ్యాచ్ లో అత్యధిక స్కోరు 714 పరుగులతో ప్రపంచ రికార్డు.. నాటింగ్ హామ్ వేదికగా ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ జట్ల మధ్య ముగిసిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో…సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. పరుగుల వెల్లువలా సాగిన ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలతో సహా రెండుజట్లూ కలసి 714 పరుగులు సాధించాయి.ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో5 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కంగారూ ఓపెనర్ డేవిడ్ […]

ప్రపంచకప్ లో... 714 పరుగులతో ప్రపంచ రికార్డు...
X
  • ఆస్ట్రేలియా- బంగ్లా మ్యాచ్ లో అత్యధిక స్కోరు
  • 714 పరుగులతో ప్రపంచ రికార్డు..

నాటింగ్ హామ్ వేదికగా ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ జట్ల మధ్య ముగిసిన ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో…సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది.

పరుగుల వెల్లువలా సాగిన ఈ మ్యాచ్ లో రెండు సెంచరీలతో సహా రెండుజట్లూ కలసి 714 పరుగులు సాధించాయి.ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో5 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

కంగారూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఒక్కడే 166 పరుగులు సాధించాడు. సమాధానంగా 382 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మొత్తం మీద రెండుజట్లూ కలసి వంద ఓవర్లలో 714 పరుగులు చేసి సరికొత్త రికార్డు నమోదు చేయగలిగాయి.

ఈ మ్యాచ్ కు ముందు వరకూ 2015 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా- శ్రీలంక జట్ల మ్యాచ్ లో నమోదైన 688 పరుగుల స్కోరే..అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ గా ప్రపంచ రికార్డుల్లో నిలిచింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో సాధించిన 714 పరుగుల స్కోరుతో 2015 ప్రపంచకప్ మ్యాచ్ రికార్డు తెరమరుగయ్యింది.

గత ప్రపంచకప్ లోనూ, ప్రస్తుత ప్రపంచకప్ లోనూ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాజట్టు ప్రధానపాత్ర పోషించడం విశేషం.

First Published:  21 Jun 2019 6:56 AM IST
Next Story