ఈ బలుపే వైసీపీకి ప్రమాదం
టోల్‌ప్లాజాల వద్ద రాజకీయనాయకుల ఇగోలు పదేపదే దెబ్బతింటుంటాయి. మంత్రి భార్య అయినా సరే… మంత్రి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే చోటా నాయకుడైనా సరే తాము అతీతం అన్న భ్రమలో ఉంటారు. ఆ మధ్య మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య టోల్ ప్లాజా వద్ద తన కారుకు టోల్ ఫీ కట్టేందుకు నిరాకరించడంతో పాటు సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. వంద రూపాయలు చెల్లించేందుకు నాటి మంత్రి భార్య మొండికేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి […]
టోల్‌ప్లాజాల వద్ద రాజకీయనాయకుల ఇగోలు పదేపదే దెబ్బతింటుంటాయి. మంత్రి భార్య అయినా సరే… మంత్రి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే చోటా నాయకుడైనా సరే తాము అతీతం అన్న భ్రమలో ఉంటారు. ఆ మధ్య మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య టోల్ ప్లాజా వద్ద తన కారుకు టోల్ ఫీ కట్టేందుకు నిరాకరించడంతో పాటు సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు.
వంద రూపాయలు చెల్లించేందుకు నాటి మంత్రి భార్య మొండికేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కింది. వంద రూపాయలకు చూసుకుంటే మొత్తం పరువు గంగలో కలిసింది. నెటిజన్ల నుంచి నానా విమర్శలు ఎదుర్కొన్నారు పుల్లారావు భార్య.
ఇప్పుడు వైసీపీకి చెందిన చోటా నాయకుల్లోనూ ఈ బలుపు బయలు దేరింది. అక్కడక్కడ ఓవరేక్షన్ చేయడం మొదలుపెట్టారు. తక్షణం కార్యకర్తలు, నేతలు టోల్ ప్లాజాల వద్ద, పబ్లిక్ ప్లేస్‌ల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై వైసీపీ మార్గదర్శకాలు జారీ చేసుకోవడం మంచిది.
మంత్రి బుగ్గన అనుచరులమైన తమనే ఆపుతారా? అంటూ కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై వైసీపీ మండల స్థాయి నేతలు సుధాకర్, చంద్రశేఖర్ దాడి చేశారు. కనీసం సీసీ కెమెరాలుంటాయన్న ఇంగితం కూడా లేకుండా రెచ్చిపోయారు.
అటు ప్రకాశం జిల్లా ఉప్పలపాడులో వైసీపీ గ్రామ నేతలు ఏకంగా రోడ్డును తవ్వేశారు. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే… గతంలో ఇలాంటి పనులు టీడీపీ వాళ్లు చాలా చేశారు. కానీ అప్పట్లో కేసులు నమోదు అయ్యేవి కాదు. ఇప్పుడు మాత్రం తప్పు వైసీపీ నేతలు చేస్తున్నా తక్షణమే కేసులు మాత్రం నమోదు చేస్తున్నారు. టోల్‌ప్లాజా వ్యవహారంలో, రోడ్డును తవ్విన ఉదంతంలోనూ పోలీసులు స్వేచ్చగా వ్యవహరించి కేసు నమోదు చేశారు.