వాళ్లు ఏం తింటే మనకేం? " సెహ్వాగ్
ఫల్టీలు కొట్టమంటే… దారి వంపుగా ఉందన్నాడట ఒకడు. అలా ఉంది పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల తీరు. ప్రపంచ కప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ టీం చిత్తుగా ఓడిపోతే… అందుకు కారణం సానిమా మీర్జా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. భారత్‌కు చెందిన సానియా… పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్యభర్తలు. అయితే మ్యాచ్‌కు ముందురోజు ఇతర పాక్ క్రికెట్ల తరహాలోనే షోయబ్ మాలిక్, సానియా భోజనం చేయడానికి బయటకు వెళ్లారు. మ్యాచ్ అయిపోగానే […]
ఫల్టీలు కొట్టమంటే… దారి వంపుగా ఉందన్నాడట ఒకడు. అలా ఉంది పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల తీరు. ప్రపంచ కప్ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ టీం చిత్తుగా ఓడిపోతే… అందుకు కారణం సానిమా మీర్జా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
భారత్‌కు చెందిన సానియా… పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్యభర్తలు.
అయితే మ్యాచ్‌కు ముందురోజు ఇతర పాక్ క్రికెట్ల తరహాలోనే షోయబ్ మాలిక్, సానియా భోజనం చేయడానికి బయటకు వెళ్లారు. మ్యాచ్ అయిపోగానే ఆ ఫోటోలను పాక్ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
సానియా వల్లే పాక్ ఆటగాళ్ల ఫోకస్ తప్పిందని కొందరు…. అసలు తెల్లారితే మ్యాచ్ పెట్టుకుని ఆ షికార్లు ఏమిటి? అని మరికొందరు టార్గెట్ చేశారు. పాక్ నటి వీనామాలిక్ అయితే సానియాతో పెద్ద గొడవే పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో సానియా, షోయబ్ మాలిక్ లకు అండగా మాజీలు ముందుకొచ్చారు. పాకిస్థాన్ ఓటమికి సానియా మిర్జాయే కారణమని కొందరు అభిమానులు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని, అలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థంకావడం లేదని అక్తర్ అభిప్రాయపడ్డారు. మాలిక్ ఆమె భర్త కాబట్టి…. భోజనం చేసేందుకు కలిసి బయటకు వెళ్లారని, అందులో తప్పేముందని ప్రశ్నించాడు.
భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా ఈ అంశంపై స్పందించారు. గతంలో కోహ్లి, అనుష్క శర్మ విషయంలోనూ ఇదే తరహా ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.
ఫ్యాన్స్ ఎంత భావోద్వేగంతో ఉన్నా సరే ఆటగాళ్ల కుటుంబ సభ్యులను ఆడిపోసుకోవడం సరికాదని హితవు పలికారు.
షోయబ్‌మాలిక్, సానియా ఎక్కడికెళ్లారు? ఏం తిన్నారు? అని అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. అది వారి వ్యక్తిగత అంశమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు సరిగా ఆడకపోతే అందుకు కుటుంబ సభ్యులు ఎలా కారణం అవుతారని నిలదీశారు.