అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం
పరిస్థితి తారుమారు అయింది. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకున్న సమయంలో టీడీపీ వినిపించిన డైలాగ్ ఇదే… అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని!. ఇప్పుడు అదే డైలాగ్‌ను టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ రాజ్యసభ ఎంపీలు అభివృద్ధి కోసమే తాము బీజేపీలోకి వెళ్తున్నామని చెప్పారు. బీజేపీలో చేరడంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేశ్ తాము బీజేపీలో చేరుతున్నది వాస్తవమేనని అంగీకరించారు. వెనుకబడిన తన ప్రాంతం అభివృద్ది కోసమే బీజేపీలో […]

పరిస్థితి తారుమారు అయింది. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకున్న సమయంలో టీడీపీ వినిపించిన డైలాగ్ ఇదే… అభివృద్ధిని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని!. ఇప్పుడు అదే డైలాగ్‌ను టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.
బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన టీడీపీ రాజ్యసభ ఎంపీలు అభివృద్ధి కోసమే తాము బీజేపీలోకి వెళ్తున్నామని చెప్పారు. బీజేపీలో చేరడంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేశ్ తాము బీజేపీలో చేరుతున్నది వాస్తవమేనని అంగీకరించారు. వెనుకబడిన తన ప్రాంతం అభివృద్ది కోసమే బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు.
తాము చేరడం వల్ల రాజ్యసభలో బీజేపీకి బలం కూడా పెరుగుతుందన్నారు. అలా పరస్పరం ఇరు వర్గాలకు ఉపయోగం చేకూరే అవకాశం ఉన్నందునే టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు టీజీ వెంకటేశ్ చెప్పారు.