ఇందిరా భవన్, గాంధీభవన్ మధ్య కొత్త పంచాయతీ !
2004 నుంచి 2014 వరకు కాలం కలిసివచ్చింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు టైమ్ అసలు కలిసి రావడం లేదు. ఏంటి పరిస్థితి. నాయకత్వ లోపమా? ఇంకా ఏమైనా ఉందా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య తెగ మథన పడుతున్నారు. ఇందులో తేలిన విషయం ఏంటి అంటే… గాంధీభవన్ వాస్తు దోషం పట్టింది. 2004లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది. తమకు పరిస్థితులు ఎలా అనుకూలించాయి? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పే […]
2004 నుంచి 2014 వరకు కాలం కలిసివచ్చింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నాం. ఇప్పుడు టైమ్ అసలు కలిసి రావడం లేదు. ఏంటి పరిస్థితి. నాయకత్వ లోపమా? ఇంకా ఏమైనా ఉందా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య తెగ మథన పడుతున్నారు. ఇందులో తేలిన విషయం ఏంటి అంటే… గాంధీభవన్ వాస్తు దోషం పట్టింది.
2004లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది. తమకు పరిస్థితులు ఎలా అనుకూలించాయి? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పే సమాధానం. గాంధీభవన్‌లో చేపట్టిన వాస్తు మార్పులు అని చెబుతున్నారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అప్పటి పీసీసీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌లో కొన్ని మార్పులు చేయించారట. పీసీసీ అధ్యక్షుడి గదితో పాటు ఇతర గదులను మార్పించారట. ఈ మార్పుల ఎఫెక్ట్‌తో పాటు వైఎస్ కృషి ఫలించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది టీ కాంగ్రెస్ నేతల మాట.
అయితే 2013లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గాంధీభవన్ పార్టీ కార్యక్రమాలకు సరిపోవడం లేదని తేల్చారు. ఇందుకోసం పక్కనే ఇందిరా భవన్ కట్టించారు. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఈ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి మారిపోయిందట. ఈశాన్య మూలలో ఈ బిల్డిండ్ కట్టడం వల్ల కాంగ్రెస్‌కు కాలం కలిసిరావడం లేదని నేటి నేతల మాట.
ఈ బిల్డింగ్ వల్లే తమ పరిస్థితి రోజురోజుకు దిగిజారిపోతుందని టీకాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇప్పటికైనా గాంధీభవన్ ఖాళీ చేసి ఇందిరా భవన్‌లోకి మారిపోవాలని… అప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని కొందరి సలహా.
మొత్తానికి పార్టీకి తిరిగి పునర్ వైభవం రావాలంటే వాస్తు మార్పులు జరగాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తేల్చేశారు.
అయితే ప్రస్తుతం ఇందిరా భవన్ నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి…. మరి ఏపీలో కూడా కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది కదా అని ప్రశ్నిస్తే మాత్రం ఎవరూ స్పందించడం లేదు.