కసితీరా తిట్టుకున్న చలసాని, అశోక్‌బాబు
మేధావి చలసాని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇద్దరూ కసితీరా తిట్టుకున్నారు. ఒక టీవీ చానల్ చర్చకు వచ్చిన వీరిద్దరు… ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. వీరిద్దరూ చంద్రబాబుకు అనుకూలమే అన్న ప్రచారం ఉన్నప్పటికీ… ఎక్కడ వీరి మధ్య చెడిందో గానీ చర్చలో తీవ్రంగా దూషించుకున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సర్వనాశనం చేసిన వారిని, హోదా ఉద్యమాన్ని దెబ్బతీసిన వ్యక్తులనే నేడు టీడీపీ చర్చల్లో ముందుపెడుతోందంటూ పరోక్షంగా అశోక్‌బాబుపై చలసాని విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు ముఖం చూడ్డం […]
మేధావి చలసాని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇద్దరూ కసితీరా తిట్టుకున్నారు. ఒక టీవీ చానల్ చర్చకు వచ్చిన వీరిద్దరు… ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. వీరిద్దరూ చంద్రబాబుకు అనుకూలమే అన్న ప్రచారం ఉన్నప్పటికీ… ఎక్కడ వీరి మధ్య చెడిందో గానీ చర్చలో తీవ్రంగా దూషించుకున్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని సర్వనాశనం చేసిన వారిని, హోదా ఉద్యమాన్ని దెబ్బతీసిన వ్యక్తులనే నేడు టీడీపీ చర్చల్లో ముందుపెడుతోందంటూ పరోక్షంగా అశోక్‌బాబుపై చలసాని విరుచుకుపడ్డారు.
అశోక్‌బాబు ముఖం చూడ్డం కూడా తనకు ఇష్టముండదని… అశోక్‌బాబు చర్చకు వచ్చారని తెలిసి ఉంటే తాను అసలు వచ్చే వాడినే కాదని చలసాని వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
తాము ఉద్యమం చేస్తుంటే హేళన చేసిన వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతారా? అని చలసాని ఫైర్ అయ్యారు. పనికిమాలిన వాళ్లకు, దిక్కుమాలిన వ్యక్తులను, వేస్ట్ కేండిడేట్లను తెచ్చి హోదా విషయంలో ముందుంచుతారా? అని చలసాని ప్రశ్నించారు.
దాంతో అశోక్‌బాబు ప్రతిగా బుసలుకొట్టారు. చలసాని శ్రీనివాస్ ఒక సైకో, మానసిక రోగి అని అభివర్ణించారు. అసలు హైదరాబాద్‌లో ఉండే చలసానికి ఆంధ్రాతో ఏం సంబంధం అని అశోక్‌బాబు ప్రశ్నించారు.
ఇలాంటి సైకోలను చర్చలకు పిలవడానికి వీల్లేదన్నారు. ఏమాత్రం సహనం లేని చలసాని లాంటి వారు టీవీ డీబెట్లకే అనర్హులని అశోక్‌బాబు విరుచుకుపడ్డారు. ఇలా ఇద్దరూ చాలాసేపు ఒకరినొకరు తిట్టుకున్నారు.