తెలంగాణ బీజేపీకి కొత్త తలనొప్పి !
తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్నామ్నాయం అని బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా చాటుతామని సవాళ్లు విసురుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం మాత్రం ఇప్పుడు బీజేపీ నేతలకు కొత్త తలనొప్పి తీసుకువస్తుంది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిలవడం లేదు. ఇదే విషయంపై అన్ని సార్లు పిలవడం సాధ్యం కాదనేది సీఎం కేసీఆర్ మాట. అయితే ఇక్కడ బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టు […]
తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్నామ్నాయం అని బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా చాటుతామని సవాళ్లు విసురుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం మాత్రం ఇప్పుడు బీజేపీ నేతలకు కొత్త తలనొప్పి తీసుకువస్తుంది.
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిలవడం లేదు. ఇదే విషయంపై అన్ని సార్లు పిలవడం సాధ్యం కాదనేది సీఎం కేసీఆర్ మాట. అయితే ఇక్కడ బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ప్రధానిని పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ పార్టీకి చెందిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రావడం మాత్రం లోకల్ బీజేపీ నేతలకు రుచించడం లేదు.
ఓవైపు ప్రధానిని కేసీఆర్ పిలవడం లేదు. కానీ ఫడ్నవీస్ మాత్రం వస్తున్నారు. అటు విమర్శలు చేద్దామని అనుకుంటే… ఇటు ఫడ్నవీస్ రాకను ఎలా సమర్ధించుకోవాలో తెలియక కమలనాథులు మథనపడుతున్నారు.
మొత్తానికి గులాబీ దళాన్ని చికాకు పెడతామని అనుకుంటే..తమకే చికాకు కలిగేలా ఉందని కొందరు నేతలు సైలెంట్ అయ్యారు. మొత్తానికి కాళేశ్వరం ప్రారంభోత్సవంపై బీజేపీ నేతలకు కామెంట్లు చేయడానికి స్కోప్ లేకుండా పోయింది.