Telugu Global
Cinema & Entertainment

ఏ అవకాశాన్నీ వదిలి పెట్టట్లేదు...

కామెడీ యాక్టర్ గా రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన సునీల్…. ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ అయితే షురూ చేసాడు కానీ సునీల్ అనుకున్నట్లు గా మాత్రం ఏదీ జరగడం లేదు. హీరో గా ఎటూ విజయం సాధించలేకపోయారు, అందుకే మరలా కమెడియన్ గానే తన లక్ ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకుందాం అనే ఉదేశ్యం తో ఉన్నాడు. అరవింద సమేత వీర రాఘవ వంటి పెద్ద చిత్రాల్లో […]

sunil
X

కామెడీ యాక్టర్ గా రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన సునీల్…. ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ అయితే షురూ చేసాడు కానీ సునీల్ అనుకున్నట్లు గా మాత్రం ఏదీ జరగడం లేదు. హీరో గా ఎటూ విజయం సాధించలేకపోయారు, అందుకే మరలా కమెడియన్ గానే తన లక్ ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకుందాం అనే ఉదేశ్యం తో ఉన్నాడు.

అరవింద సమేత వీర రాఘవ వంటి పెద్ద చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయి లో సునీల్ విజయం సాధించలేకపోయారు. అలాగే చిత్రలహరి సినిమా తో పర్లేదు అనిపించినా సునీల్ రేంజ్ విజయం అయితే ఇంకా దక్కలేదు.

అందుకే కాబోలు ఏ అవకాశం వచ్చినా సునీల్ మాత్రం అస్సలు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు త్వరలో గోపీచంద్ హీరో గా రానున్న చాణక్య సినిమా లో ఒక కీలక కామెడీ పాత్ర లో సునీల్ కనిపించనున్నాడు. యాక్షన్ నేపథ్యం తో సాగనున్న ఈ సినిమా లో కామెడీ చేస్తూ సునీల్ అందరినీ నవ్వించనున్నాడు అని తెలుస్తుంది. అయితే సునీల్ పాత్ర గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First Published:  19 Jun 2019 9:39 AM IST
Next Story