Telugu Global
NEWS

ప్రపంచకప్ లో రషీద్ ఖాన్ చెత్త రికార్డు

9 ఓవర్లలో 110 పరుగులిచ్చిన అప్ఘన్ స్పిన్నర్ అత్యధిక సిక్సర్లు బాదించుకొన్న బౌలర్ గా రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్ల మోత మోగించిన మోర్గాన్ క్రికెట్ పసికూన అఫ్ఘనిస్థాన్ తురుపుముక్క రషీద్ ఖాన్. లెగ్ స్పిన్, గుగ్లీలతో టీ-20 ఫార్మాట్లో మ్యాజిక్ చేసే రషీద్ ఖాన్ ది ప్రపంచ మేటి బౌలర్లలో మూడో ర్యాంక్. అయితే…50 ఓవర్ల వన్డే క్రికెట్లో మాత్రం రషీద్ ఖాన్ తేలిపోయాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే […]

ప్రపంచకప్ లో రషీద్ ఖాన్ చెత్త రికార్డు
X
  • 9 ఓవర్లలో 110 పరుగులిచ్చిన అప్ఘన్ స్పిన్నర్
  • అత్యధిక సిక్సర్లు బాదించుకొన్న బౌలర్ గా రషీద్ ఖాన్
  • రషీద్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్ల మోత మోగించిన మోర్గాన్

క్రికెట్ పసికూన అఫ్ఘనిస్థాన్ తురుపుముక్క రషీద్ ఖాన్. లెగ్ స్పిన్, గుగ్లీలతో టీ-20 ఫార్మాట్లో మ్యాజిక్ చేసే రషీద్ ఖాన్ ది ప్రపంచ మేటి బౌలర్లలో మూడో ర్యాంక్. అయితే…50 ఓవర్ల వన్డే క్రికెట్లో మాత్రం రషీద్ ఖాన్ తేలిపోయాడు.

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో రషీద్ ఖాన్ ఓ పరమ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ లో కేవలం 9 ఓవర్లలోనే 110 పరుగులిచ్చాడు.

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా మాత్రమే కాదు..అత్యధిక సిక్సర్లు బాదించుకొన్న బౌలర్ గా కూడా రికార్డుల్లో చేరాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 71 బాల్స్ లో 17 సిక్సర్లు, 4 బౌండ్రీలతో సాధించిన 148 పరుగుల స్కోరులో…రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే వందకు పైగా పరుగులు సాధించడం విశేషం.

నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో…ఓ సింగిల్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదించుకొన్న బౌలర్ గా రషీద్ ఖాన్, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మన్ గా వోయిన్ మోర్గాన్ రికార్డుల్లో చేరారు.

First Published:  19 Jun 2019 7:55 AM IST
Next Story