Telugu Global
NEWS

పట్టు వీడిన 'పుట్టా'

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో సభ్యులందరూ వరుసగా రాజీనామాలు చేసినా చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాత్రం తాను రాజీనామా చేయనని, తనను ఆ పదవి నుంచి ప్రభుత్వమే తొలగించాలని…. అప్పుడే దిగిపోతానని పట్టుబట్టాడు. సాధారణంగా ఒక ప్రభుత్వం దిగిపోయి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పాత ప్రభుత్వం ద్వారా వివిధ పదవుల్లో నియమితులైన వ్యక్తులు ఆ పార్టీ ఓడిపోగానే రాజీనామాలు చేయడం సహజం. అలాగే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయి వైసీపీ అధికారంలోకి […]

పట్టు వీడిన పుట్టా
X

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో సభ్యులందరూ వరుసగా రాజీనామాలు చేసినా చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాత్రం తాను రాజీనామా చేయనని, తనను ఆ పదవి నుంచి ప్రభుత్వమే తొలగించాలని…. అప్పుడే దిగిపోతానని పట్టుబట్టాడు.

సాధారణంగా ఒక ప్రభుత్వం దిగిపోయి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పాత ప్రభుత్వం ద్వారా వివిధ పదవుల్లో నియమితులైన వ్యక్తులు ఆ పార్టీ ఓడిపోగానే రాజీనామాలు చేయడం సహజం. అలాగే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయి వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నియమించిన చాలామంది రాజీనామా చేశారు.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ లాంటి కొద్దిమంది మాత్రం చూరుకు వేళాడుతూ ఉండిపోయారు. ఇక లాభం లేదనుకుని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ టీటీడీ బోర్టును తొలగిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకు వస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే పుట్టా తన రాజీనామా లేఖను సీఈఓ సింగాల్‌ కు పంపించాడు. అయితే పుట్టా మీద ఇటీవల కొన్ని అవినీతి ఆరోపణలు రావడం, స్విమ్స్‌ ఆసుపత్రి వర్గాలు పుట్టాపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం…. నేపధ్యంలో పుట్టా రాజీనామా చేయక తప్పదని అందరూ భావించారు…. ఎట్టకేలకు అవమానకరంగానైనా ఆయన దిగిపోతున్నాడు.

First Published:  19 Jun 2019 6:42 AM GMT
Next Story