Telugu Global
NEWS

మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు.... ఆయన్ని పిలవాల్సిన అవసరం ఏముంది?

ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆయనను ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మోడీని ఎందుకు పిలవడం లేదు అని ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. గతంలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీని పిలిచానని ఆయన […]

మోడీపై కేసీఆర్ వ్యాఖ్యలు.... ఆయన్ని పిలవాల్సిన అవసరం ఏముంది?
X

ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆయనను ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మోడీని ఎందుకు పిలవడం లేదు అని ప్రశ్నించగా పై విధంగా స్పందించారు.

రాష్ట్రంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. గతంలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీని పిలిచానని ఆయన గుర్తు చేశారు. నేను ఒక సీఎం హోదాలో చాలా సంతృప్తికరంగా కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని చేస్తున్నానని స్పష్టం చేశారు.

మా పార్టీ ఎన్డీయేలో భాగస్వామ్యం కాదని.. ఇప్పటికీ ఫెడరల్ ఫ్రంట్‌కి కట్టుబడి ఉన్నానని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కేంద్రంతో రాజ్యాంగపరంగా ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో అలాగే కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక నేను ఎక్కువ విమర్శించానని… ఎలాంటి సంప్రదింపులు లేకుండానే సీలేరు ప్రాజెక్టును ఏపీకి అప్పగించడంతో ఫాసిస్టు పీఎం అని విమర్శించింది నేనేనని కేసీఆర్ చెప్పారు.

కాళేశ్వరం మూడు రాష్ట్రాల సమన్వయంతో చేపట్టిన ప్రాజెక్టు.. ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం మరువలేనిదని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం పూర్తైంది కనుక ఇక పాలమూరు ఎత్తిపోతల పథకంపై దృష్టి సారిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  19 Jun 2019 2:39 AM IST
Next Story