వరుణ్-వెంకీతో అల్లు శిరీష్ పోటీ
వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన ఎఫ్2 సినిమా సంక్రాంతికి వచ్చింది. ఇక అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమా ఈమధ్యే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఎఫ్2 సినిమాకు అల్లు శిరీష్ ఎలా పోటీ ఇస్తాడు. అక్కడికే వస్తున్నాం. వెండితెరపై కాదు, బుల్లితెరపై వెంకీ-వరుణ్ కు జాయింట్ గా పోటీ ఇవ్వబోతున్నాడు శిరీష్. అవును.. ఈ రెండు సినిమాలు ఒకే రోజు, ఒకే టైమ్ కు వేర్వేరు ఛానెళ్లలో ప్రసారం కాబోతున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం 6 […]
వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన ఎఫ్2 సినిమా సంక్రాంతికి వచ్చింది. ఇక అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమా ఈమధ్యే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఎఫ్2 సినిమాకు అల్లు శిరీష్ ఎలా పోటీ ఇస్తాడు. అక్కడికే వస్తున్నాం. వెండితెరపై కాదు, బుల్లితెరపై వెంకీ-వరుణ్ కు జాయింట్ గా పోటీ ఇవ్వబోతున్నాడు శిరీష్. అవును.. ఈ రెండు సినిమాలు ఒకే రోజు, ఒకే టైమ్ కు వేర్వేరు ఛానెళ్లలో ప్రసారం కాబోతున్నాయి.
ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎఫ్2 సినిమాను స్టార్ మా టీవీలో ప్రసారం చేయబోతున్నారు. అదే రోజు అదే సమయానికి అల్లుశిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాను జీ తెలుగులో ప్రసారం చేయబోతున్నారు. ఇలా రెండు సినిమాల మధ్య బుల్లితెరపై పోటీ నెలకొంది. నిజానికి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ఎక్కువమంది చూస్తారనేది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది.
సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 సినిమాను చాలామంది చూసేశారు. పండగ సీజన్ కూడా కావడంతో కుటుంబాలతో కలిసి ఆ సినిమాకు వెళ్లారు. పైగా చాన్నాళ్ల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా ఈ సినిమా నలుగుతోంది. కాబట్టి టీవీలో ఎఫ్2కు ప్రేక్షకులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
అదే ఏబీసీడీ సినిమా విషయానికొస్తే, థియేటర్లలో ఇది ఫ్లాప్ సినిమా. సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమాను ఎవరూ చూడలేదు. పైగా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలపై కూడా ఈ సినిమా ఇంకా రాలేదు. సో.. చాలామంది ప్రేక్షకులకు ఏబీసీడీ సినిమా కొత్త. కాబట్టి హీరోతో, రిజల్ట్ తో సంబంధం లేకుండా బుల్లితెరపై ఏబీసీడీ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. సో.. ఈ ఆదివారం ఈ రెండు సినిమాల్లో ఏది గెలుస్తుందో చూడాలి.