Telugu Global
NEWS

నేటి నుంచి ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో సంచలన మార్పు. స్వాతంత్రం సిద్దించిన తర్వాత పోలీస్ శాఖలో తొలిసారిగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు బుధవారం నుంచి వీక్లీ ఆఫ్ లు అమలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 70 వేల మంది పోలీస్ సిబ్బందికి నేటి నుంచి వారంతపు సెలవు అమలు కానుంది. గత […]

నేటి నుంచి ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్
X

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో సంచలన మార్పు. స్వాతంత్రం సిద్దించిన తర్వాత పోలీస్ శాఖలో తొలిసారిగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు బుధవారం నుంచి వీక్లీ ఆఫ్ లు అమలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 70 వేల మంది పోలీస్ సిబ్బందికి నేటి నుంచి వారంతపు సెలవు అమలు కానుంది.

గత కొంత కాలంగా తమకు వారంతపు సెలవు కావాలంటూ పోలీస్ సిబ్బంది ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. అయితే తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఇచ్చేందుకు గత ప్రభుత్వాలు ముందుకు రాలేదు. తన పాదయాత్ర సందర్భంగా పోలీసులు పడుతున్న ఇబ్బందులను నేరుగా చూసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారంతపు
సెలవు ఇస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి కాగానే దీనిపై ఓ కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బుధవారం నుంచి పోలీసులకు వారంతపు సెలవును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో 12,384 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్ లపై నిర్ణయం తీసుకుంటామని గత ప్రభుత్వాలు దాట వేసాయి.

అయితే ఈ సమస్యకు పోలీస్ శాఖలలో ఉన్న వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేసి సిబ్బందికి వీక్లీ ఆఫ్ లు ఇవ్వవచ్చునని కమిటీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవును ప్రకటించారు.

విధులలో ఉండగా సెలవులు లేకపోవడం, అదనపు పని భారం పడడంతో పదవి విరమణ అనంతరం పోలీసులు అనారోగ్యం పాలై త్వరగా మరణిస్తున్నారని, ఈ సమస్యకు వీక్లీ ఆఫ్ లే పరిష్కారమని కమిటీ సూచించింది.

పామాయిల్ రైతులకు వరాలు

ఆంధ్రప్రదేశ్ లో పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పామాయిల్ గిట్టుబాటు ధరను టన్నుకు 600 రూపాయలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ పామాయిల్ రైతులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పామాయిల్ రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిపిన సమీక్షా సమావేశంలో రైతుల స్ధితిగతులపై చర్చించారు.

తెలంగాణలో పామాయిల్ ఎక్స్ ట్రాక్షన్ 18.96 శాతంగా ఉంది. అదే ఆంద్రప్రదేశ్ లో 17.22 శాతంగా ఉంది. ఎక్స్ ట్రాక్షన్ లో వస్తున్న ఈ తేడా కారణంగా ఆంధ్రప్రదేశ్ పామాయిల్ రైతులు టన్నుకు 600 రూపాయలు నష్టపోతున్నారని గుర్తించారు. దీంతో ఆ తేడా మొత్తాన్ని గిట్టుబాటు ధరకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

First Published:  19 Jun 2019 6:09 AM IST
Next Story