Telugu Global
NEWS

కోడెల ఫ్యామిలీపై మరో కొత్త కేసు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల ఫ్యామిలీ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. వాళ్ళ ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడెల అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ, కూతురు పూనాటి విజయలక్ష్మి చేసిన దందాలు, దౌర్జన్యాలు, సెటిల్‌ మెంట్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నేల నుంచి నింగి వరకు వారు చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. కూతురు భూకబ్జాలు, బలవంతపు వసూళ్ళ కేసులతో…. కొడుకు కేబుల్ పైరసీ ద్వారా భారత దేశ […]

కోడెల ఫ్యామిలీపై మరో కొత్త కేసు
X

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల ఫ్యామిలీ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. వాళ్ళ ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడెల అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ, కూతురు పూనాటి విజయలక్ష్మి చేసిన దందాలు, దౌర్జన్యాలు, సెటిల్‌ మెంట్లు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నేల నుంచి నింగి వరకు వారు చేసిన అక్రమాలు బయటపడుతున్నాయి. కూతురు భూకబ్జాలు, బలవంతపు వసూళ్ళ కేసులతో…. కొడుకు కేబుల్ పైరసీ ద్వారా భారత దేశ చరిత్ర లో ఇంత భారీ స్దాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదే అని కోర్టు వ్యాఖ్యలు చేసే స్థాయిలో అడ్డంగా దొరికిపోయారు.

టీడీపీ అధికారం పోవడం, ఇప్పుడు పోలీసులు కూడా కోడెల ఫ్యామిలీ బాధితులు కేసులు పెడితే తీసుకుంటుండడంతో… మరికొందరు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి కోడెల కుమారుడు, కూతురు పై ఫిర్యాదులు చేస్తున్నారు. కోడెల పై కూడా ఓ క్రీడా కారుడు అవినీతి కేసు పెట్టాడు.

కొద్దిరోజుల క్రితమే కోడెల కూతురు విజయలక్ష్మి పై ఒక ప్రభుత్వ టీచర్‌ భూ కబ్జాకేసు పెట్టారు. తన పొలాన్ని కబ్జాచేసి… ఆ పొలాన్ని తిరిగి ఇవ్వాలంటే రూ.15 లక్షల కోడెల‌ ట్యాక్స్‌ కట్టాలని బెదిరించారని…. వాళ్ళు అడిగిన విధంగా డబ్బులు ఇచ్చినా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తరువాత కోడెల కుమారుడు, కూతురు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్ళినా వాళ్ళపై కేసులు మాత్రం ఆగడం లేదు.

ఇప్పుడు ఒక డాక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో విజయలక్ష్మి పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. సత్తెనపల్లి పీఎస్‌లో ఈ చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

ఓ ఆస్పత్రికి ఎన్టీఆర్‌ వైద్య సేవలు ఇప్పిస్తానంటూ డీల్‌ కుదుర్చుంది కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి. తొలి విడతగా 4 లక్షలు వసూలు చేసిందట ఆమె.

అయితే వైద్య సేవల పథకం మంజూరు కాకపోవడంతో… ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి కోరడంతో… విజయలక్ష్మి బెదింపులకు దిగిందని డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి చెబుతున్నారు. దీంతో సత్తెనపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో… విజయలక్ష్మితో పాటు మరో ఇద్దరిపై కూడా ఈ చీటింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.

అయితే ఈ కేసుల కన్నా కోడెల ఫ్యామిలీ వేరే విషయానికి చాలా బాధపడుతోందట…. పార్టీకోసం…. నాయకుడి కోసం ఎంతో దిగజారి, ఎన్నో సేవలు చేసినా…. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు తనను పార్టీ పట్టించుకోవడం లేదని కోడెల తెగ బాధపడుతున్నాడట. అయితే పార్టీ నాయకులు మాత్రం… ఉన్నతమైన పదవిలో ఉండి…. వసూళ్లకోసం ఇంతగా దిగజారి బజారున పడ్డ ఫ్యామిలీకి అండగా నిలిస్తే పార్టీ పరువు పోతుందని అంటున్నారట.

First Published:  19 Jun 2019 11:56 AM IST
Next Story