ఆరు పరుగులకే ఆలౌట్ ... మహిళా టీ-20 క్రికెట్లో మరో చెత్త రికార్డు
ఆరు పరుగులకే మాలీజట్టు ఆలౌట్ చైనా 14 పరుగుల చెత్త రికార్డు తెరమరుగు ఫార్సుగా తయారైన మహిళా క్రికెట్ మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయాలన్న ఐసీసీ వ్యూహం బెడిసి కొడుతోంది. చివరకు మర్యాదస్తుల క్రీడ క్రికెట్ ..మర్యాదనే కోల్పోయే ప్రమాదంలో పడిపోతోంది. క్రికెట్ ఆటలో ఆరు పరుగులు సాధించడానికి ఓ సిక్సర్ షాట్ కొడితే చాలు. అయితే.. మహిళా టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లో మాత్రం.. మాలీ మహిళా క్రికెట్ జట్టు కేవలం ఆరు పరుగులకే కుప్పకూలి…అతితక్కువ పరుగులకు […]
- ఆరు పరుగులకే మాలీజట్టు ఆలౌట్
- చైనా 14 పరుగుల చెత్త రికార్డు తెరమరుగు
- ఫార్సుగా తయారైన మహిళా క్రికెట్
మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయాలన్న ఐసీసీ వ్యూహం బెడిసి కొడుతోంది. చివరకు మర్యాదస్తుల క్రీడ క్రికెట్ ..మర్యాదనే కోల్పోయే ప్రమాదంలో పడిపోతోంది.
క్రికెట్ ఆటలో ఆరు పరుగులు సాధించడానికి ఓ సిక్సర్ షాట్ కొడితే చాలు. అయితే.. మహిళా టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లో మాత్రం.. మాలీ మహిళా క్రికెట్ జట్టు కేవలం ఆరు పరుగులకే కుప్పకూలి…అతితక్కువ పరుగులకు ఆలౌటైన జట్టుగా చెత్తరికార్డును మూటగట్టుకొంది.
కిగాలీ సిటీ వేదికగా జరుగుతున్న కివీబుకా అంతర్జాతీయ మహిళా టీ-20టోర్నీలో భాగంగా…రువాండోతో జరిగిన పోటీలో మాలీ కేవలం 6 ఓవర్లలో.. ఆరు పరుగులకే కుప్పకూలింది. మాలి సాధించిన మొత్తం ఆరుపరుగుల స్కోరులో మారిమా ఒక్క పరుగు సాధించగా.. మిగిలిన 5 పరుగులూ.. ఎక్స్ ట్రాల రూపంలో వచ్చినవే కావడం విశేషం.
సమాధానంగా 7 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన రువాండా 4 బాల్స్ లోనే విజయం సొంతం చేసుకోగలిగింది.
గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో చైనా సాధించిన 14 పరుగుల స్కోరే పరమచెత్త ప్రపంచ రికార్డుగా ఉంది.
ఇప్పుడు మాలీ 6 పరుగులకే కుప్పకూలడం ద్వారా చైనా రికార్డును వెనక్కునెట్టగలిగింది.
ఎమిరేట్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు సాధిస్తే..సమాధానంగా చైనా 10 ఓవర్లలో 14 పరుగులకే కుప్పకూలడం నిన్నటి వరకూ..ఓ ప్రపంచ రికార్డుగా నిలిచిపోయింది.