Telugu Global
NEWS

ఈ ప్రభుత్వానికి అప్పు పుట్టనంత ఎక్కువ అప్పు మేమే చేసేశాం

మొత్తం మీద ఇప్పటికైనా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు నిజం ఒప్పుకున్నాడు. ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని…. సుమారు 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందని వైసీపీ విమర్శిస్తుంటే…. టీడీపీ నాయకులంతా దానిని వ్యతిరేకించారు. మా హయాంలో జరిగినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని బుకాయించారు. మా నాయకుడికి తెలిసినంత ఎకనామిక్స్‌ ఎవరికి తెలుసు? అని దబాయించారు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు తెలిసాక ఇప్పుడు యనమల రామకృష్ణుడు తమ అప్పుల […]

ఈ ప్రభుత్వానికి అప్పు పుట్టనంత ఎక్కువ అప్పు మేమే చేసేశాం
X

మొత్తం మీద ఇప్పటికైనా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు నిజం ఒప్పుకున్నాడు. ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని…. సుమారు 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందని వైసీపీ విమర్శిస్తుంటే…. టీడీపీ నాయకులంతా దానిని వ్యతిరేకించారు.

మా హయాంలో జరిగినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని బుకాయించారు. మా నాయకుడికి తెలిసినంత ఎకనామిక్స్‌ ఎవరికి తెలుసు? అని దబాయించారు.

ఎన్నికలు అయిపోయి ఫలితాలు తెలిసాక ఇప్పుడు యనమల రామకృష్ణుడు తమ అప్పుల కుప్ప ప్రభుత్వం గురించి నోరు జారినట్టు ఉన్నాడు…. ఈ ప్రభుత్వం ఇన్ని హామీలు ఇస్తోంది… ఇన్ని కార్యక్రమాలు చేపడుతోంది… వీటికి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? అప్పులు తెచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చాన్స్‌ లేదు… మా ప్రభుత్వ హయాంలోనే నిబంధనలకు మించి అప్పులు తెచ్చాం. వాటితో పాటు బయట దొరికినన్ని అప్పులు కూడా తీసుకున్నాం. అప్పుదొరికే ఏ అవకాశాన్ని వదల్లేదు.

ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి అప్పులు తెస్తుంది? ఈ కార్యక్రమాలను ఎలా నెరవేరుస్తుంది? మేము చెల్లించని వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌ లో ఉన్నాయి…. వాటిని ఎలా తీరుస్తారు? అని ప్రశ్నించాడు.

First Published:  18 Jun 2019 7:31 AM IST
Next Story