Telugu Global
NEWS

పంజాగుట్టలో ఉద్రిక్తత... కాంగ్రెస్ నేత విహెచ్ అరెస్ట్

పంజాగుట్ట ప్రాంతం మంగళవారం ఉదయం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు, కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పంజాగుట్ట చేరుకున్నారు. తన వెంట రాజ్యంగ నిర్మాత డా. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసుకుని వచ్చారు హనుమంత రావు. ఆ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేసారు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని హనుమంత రావుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను […]

పంజాగుట్టలో ఉద్రిక్తత... కాంగ్రెస్ నేత విహెచ్ అరెస్ట్
X

పంజాగుట్ట ప్రాంతం మంగళవారం ఉదయం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు, కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పంజాగుట్ట చేరుకున్నారు. తన వెంట రాజ్యంగ నిర్మాత డా. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసుకుని వచ్చారు హనుమంత రావు. ఆ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేసారు.

ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని హనుమంత రావుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు.

రెండు నెలల క్రితం పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. దీంతో విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించాలంటూ మాదిక పోరట సమితి నాయకుడు మంద క్రిష్ణ మాదిగ, వి. హనుమంత రావు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు.

ఈ నేపథ్యంలో మంగళవారం నాడు కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంత రావు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏకంగా విగ్రహంతో సహా పంజాగుట్ట చేరుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు పంజాగుట్ట చేరుకుని హనుమంత రావును, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన పై దళిత సంఘాలు, బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు హనుమంత రావు చేస్తుంటే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.

First Published:  18 Jun 2019 5:20 AM IST
Next Story