సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం " జేపీ నారాయణ
ఏపీలో ఎన్నికల సమయంలో దశల వారీగా సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీపై పలు రకాల సూచనలు, విమర్శలు వచ్చాయి. తాజాగా లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కూడా దీనిపై స్పందించాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఆచరణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. మద్యపాన నిషేధానికి, మద్యం నియంత్రణకు చాలా వ్యత్యాసం ఉందని.. ఎన్నో కుటుంబాలు మద్యం కారణంగా నాశనమైపోతున్నాయని ఆయన అన్నాడు. మద్యాన్ని నియంత్రించడమే దీనికి […]

ఏపీలో ఎన్నికల సమయంలో దశల వారీగా సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీపై పలు రకాల సూచనలు, విమర్శలు వచ్చాయి. తాజాగా లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కూడా దీనిపై స్పందించాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం ఆచరణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. మద్యపాన నిషేధానికి, మద్యం నియంత్రణకు చాలా వ్యత్యాసం ఉందని.. ఎన్నో కుటుంబాలు మద్యం కారణంగా నాశనమైపోతున్నాయని ఆయన అన్నాడు. మద్యాన్ని నియంత్రించడమే దీనికి సరైన పరిష్కారమని అన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతం కాలేదని ఆయన అన్నాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం వల్ల అవినీతి పెరగడమే కాక అక్రమ, నకిలీ మద్యం ఏరులై పారే అవకాశం ఉంటుందని జేపీ అభిప్రాయపడ్డాడు. అతి తక్కువ మద్యం షాపులను ఏర్పాటు చేయాలని…. బెల్టు షాపులన్నీ సమూలంగా తీసేయాలని ఆయన కోరాడు. మద్యపాన నియంత్రణ కఠినంగా అమలు చేయడంతో పాటు డీ-అడిక్షన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని జేపీ అభిప్రాయపడ్డాడు. సామాన్యులకు మద్యం అందుబాటులో లేకుండా చేసి ఒక పద్దతి ప్రకారం నియంత్రిస్తే సత్ఫలితాలుంటాయని ఆయన చెప్పాడు.