బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. తాను ఇంతకు మునుపు స్థాపించిన జనజాగృతి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా ఉన్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం, నేపథ్యం లేని కొత్తపల్లి గీతకు 2014లో వైఎస్ జగన్ టికెట్ ఇచ్చి గెలిపించారు. అయితే అప్పట్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి […]
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. తాను ఇంతకు మునుపు స్థాపించిన జనజాగృతి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా ఉన్నారు.
ఎటువంటి రాజకీయ అనుభవం, నేపథ్యం లేని కొత్తపల్లి గీతకు 2014లో వైఎస్ జగన్ టికెట్ ఇచ్చి గెలిపించారు. అయితే అప్పట్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో చాలా మంది ఇతర పార్టీల్లో చేరారు. గీత కూడా పార్టీ మారి టీడీపీలోనికి వెళ్లారు. అయితే అనూహ్యంగ ఆమె అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి జన జాగృతి పార్టీని పెట్టారు. ఆ పార్టీ కనీసం ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు.
అంతే కాకుండా గీత, ఆమె భర్త హైదరాబాద్‌లో గచ్చిబౌలి ప్రాంతంలోని భూవివాదంలో ఇరుక్కున్నారు. అప్పటి నుంచి ఆమె కాస్త మౌనంగానే ఉన్నారు. చివరికి ఇవ్వాళ బీజేపీలో చేరారు.
Heartfelt regards to Hon’ble @AmitShah ji & @rammadhavbjp ji for heartfully inviting me & giving me an opportunity to serve people through @BJP4India and assure to work dedicatedly for the party under his able guidance and leadership pic.twitter.com/ELet9VtmGm
— Geetha Kothapalli MP (@Geethak_MP) June 18, 2019