Telugu Global
NEWS

బాబుకు కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు...! " మంత్రి తలసాని

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. “మా నాయకుడు కేసీఆర్ మాట తప్పరు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ గిఫ్ట్ ఏమిటో ప్రజలకు కూడా అర్థం అయింది. మా నాయకుడు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ అందింది” అని […]

బాబుకు కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు...!  మంత్రి తలసాని
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

“మా నాయకుడు కేసీఆర్ మాట తప్పరు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ గిఫ్ట్ ఏమిటో ప్రజలకు కూడా అర్థం అయింది. మా నాయకుడు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ అందింది” అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భవితవ్యం లేదని, దీనికి కారణం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలేనని మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పట్ల ఎంతో అభిమానంతో ఉండే కార్యకర్తలు ఇప్పటికీ ఉన్నారని, వారి కారణంగానే ఇన్నాళ్లు పార్టీ బతికి బట్ట కట్టిందని, అలాంటి కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి దూరం చేశారని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం…. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షంలో విలీనం కావడం రాజ్యాంగబద్ధంగా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వ హయాంలో దళితులను, బీసీలను పట్టించుకోలేదని, అందుకే వారంతా కెసిఆర్ వైపు ఉన్నారని తలసాని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు గతాన్ని మరిచిపోయి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని, అందుకే వారంతా గందరగోళంలో ఉన్నారని మంత్రి చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ లోక్ సభలో నాలుగు స్థానాలు గెలవగానే ఎగిరెగిరి పడుతోందని, తెలంగాణలో తమను ఎదుర్కోవడం భారతీయ జనతా పార్టీకి సాధ్యం కాని పనని మంత్రి చెప్పారు.

లోక్ సభకు పోటీ చేసిన తన కుమారుడి పరాజయంపై మాట్లాడుతూ “ఎన్నికలలో గెలుపోటములు, రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ రెండింటిని స్వీకరించాల్సి ఉంటుంది” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

First Published:  18 Jun 2019 5:09 AM IST
Next Story