Telugu Global
NEWS

ఆంధ్రాలో జరిగిందే.... తెలంగాణలోనూ జరుగుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎంపీలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే 23 సంఖ్యలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందా…? ఇక్కడ […]

ఆంధ్రాలో జరిగిందే.... తెలంగాణలోనూ జరుగుతుందా?
X

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎంపీలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే 23 సంఖ్యలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందా…? ఇక్కడ కూడా దేవుడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తాను కలిపేసుకున్న కాంగ్రెస్ శాసనసభ్యుల సంఖ్యనే తర్వాత జరిగే ఎన్పికల్లో గెలుచుకుంటుందా…? ఆంధ్రప్రదేశ్ లో దేవుడు చేసిన పని తెలంగాణలో కూడా చేస్తాడా..? ఇది సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ప్రశ్న.

తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితి పార్టీలో విలీనం చేసుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్ధానాల్లోనే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని అధికార పార్టీలో విలీనం చేస్తూ స్పీకర్ కు విలీన పత్రం అందచేశారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇదే విధంగా గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇది దేవుడి వల్ల, ప్రజల వల్ల జరిగిందని ఏపీ సిఎం అన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి దేవుడు గుణపాఠం చెప్పినట్లుగానే తెలంగాణలో కూడా అధికార పార్టీకీ పాఠాలు నేర్పుతాడా…? లేక ఇక్కడి ముఖ్యమంత్రి చేసే యాగాలు, హోమాలకు సంతుష్టుడై క్షమించేస్తాడా…? ఇది తేలాలంటే మరో నాలుగున్నరేళ్లు ఆగాలి.

First Published:  18 Jun 2019 1:31 AM GMT
Next Story