లోకేష్ చేసిన తప్పు అదే " సుజనా చౌదరి
ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఈ ఫలితాలను జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న మాజీ మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడం మరింతగా కుంగ దీసింది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరూ స్పందించకపోయినా… టీడీపీ నాయకుడు సుజనా చౌదరి మాత్రం స్పందించాడు. నారా లోకేష్ యువకుడని.. ఓటమి నుంచి ఆయన పాఠాలు […]
ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఈ ఫలితాలను జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న మాజీ మంత్రి లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడం మరింతగా కుంగ దీసింది.
ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరూ స్పందించకపోయినా… టీడీపీ నాయకుడు సుజనా చౌదరి మాత్రం స్పందించాడు. నారా లోకేష్ యువకుడని.. ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు.
మంగళగిరిలో ఎన్నో ఏండ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదని… తాను అక్కడ పసుపు జెండా ఎగరవేస్తానని లోకేష్ బరిలోకి దిగడం చాలా పెద్ద తప్పని సుజనా స్పష్టం చేశాడు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత కొంత కాలంగా చాలా కష్టపడి పని చేస్తున్నారని…. అంతే కాకుండా అక్కడ ఆయన సామాజిక వర్గం బలంగా ఉండటంతో గెలుపు సుసాధ్యం అయ్యిందన్నాడు.
ఇప్పటికీ చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ అనుమానాలు లేవని అన్నాడు. ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని.. మరింత కాలం పార్టీని ఆయన నడిపిస్తాడని సుజనా ఆశాభావం వ్యక్తం చేశాడు.