ఇప్పుడు మళ్ళీ జేడీ చూపు బీజేపీ వైపు
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా పార్టీలకు, నేతలకు కోలుకోలేని విధంగా షాకిచ్చాయి. ప్రధానంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్కటంటే ఒక్క సీటు దక్కకుండా చేశాయి. దీంతో ఏపీలో బలపడుదామని కలలుగన్న బీజేపీ, కాంగ్రెస్ కలలు కల్లలయ్యాయి. ఇక ఏపీలో ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిన జనసేన ఆశలు కూడా నెరవేరలేదు. కర్ణాటకలో లాగా కింగ్ మేకర్ అవుదామని కలలుగన్న పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. ఇక జనసైనికులకు కూడా ఆ […]

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా పార్టీలకు, నేతలకు కోలుకోలేని విధంగా షాకిచ్చాయి. ప్రధానంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్కటంటే ఒక్క సీటు దక్కకుండా చేశాయి. దీంతో ఏపీలో బలపడుదామని కలలుగన్న బీజేపీ, కాంగ్రెస్ కలలు కల్లలయ్యాయి.
ఇక ఏపీలో ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిన జనసేన ఆశలు కూడా నెరవేరలేదు. కర్ణాటకలో లాగా కింగ్ మేకర్ అవుదామని కలలుగన్న పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. ఇక జనసైనికులకు కూడా ఆ పార్టీపై నమ్మకం సన్నగిల్లింది.
తాజాగా జనసేన నుంచి పోటీచేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మొన్నటి ఎన్నికలకు ముందు వరకు ఆయన పార్టీ పెట్టి ప్రజాసేవ చేద్దామని ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు. చివరలో లోక్ సత్తా పార్టీని టేకప్ చేస్తారని వినిపించింది. ఇక టీడీపీలో చేరుదామనుకున్నా వైసీపీ విమర్శించడంతో వెనక్కితగ్గాడు. ఒకప్పుడు వైసీపీ అధినేతపై కేసులు పెట్టి విచారించిన జేడీ టీడీపీలో చేరితే కష్టమని ఇక జనసేనలో చేరారు. బీజేపీ ఏపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తానన్నా జేడీ ఆ పార్టీ గెలవదని విశ్వసించి వదిలేశాడు.
ఇప్పుడు జనసేనలో ఓడిపోయాక జేడీ అస్సలు బయట కనిపించడం లేదు. ఆయన జనసేన అధినేత పవన్ కు, ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. దీంతో పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజాగా కేంద్రంలో బీజేపీ గెలవడంతో ఈయన బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఎన్నికల ముందు ఇచ్చిన ఆఫర్ ను ఇప్పుడు తీసుకోవాలని.. ఏపీలో బీజేపీ బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం. దీంతో జేడీ కూడా పవన్ కు షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు.