Telugu Global
NEWS

ప్రపంచకప్ లో నేడే దాయాదుల సమరం

సూపర్ సండే వార్ కు భారత్-పాక్ రెడీ మాంచెస్టర్ ను వెంటాడుతున్న వర్షం ప్రపంచకప్ లో పాక్ పై 7వ విజయానికి భారత్ తహతహ 2019 వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల సమరానికి…మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గత కొద్దిరోజులుగా కురిసిన భారీవర్షాలకు మ్యాచ్ వేదిక తడిసి ముద్దకావటం, మ్యాచ్ రోజున తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో..అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు. ఇన్ […]

ప్రపంచకప్ లో నేడే దాయాదుల సమరం
X
  • సూపర్ సండే వార్ కు భారత్-పాక్ రెడీ
  • మాంచెస్టర్ ను వెంటాడుతున్న వర్షం
  • ప్రపంచకప్ లో పాక్ పై 7వ విజయానికి భారత్ తహతహ

2019 వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల సమరానికి…మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

గత కొద్దిరోజులుగా కురిసిన భారీవర్షాలకు మ్యాచ్ వేదిక తడిసి ముద్దకావటం, మ్యాచ్ రోజున తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ఉండటంతో..అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు.

ఇన్ డోర్ లో ప్రాక్టీస్…

ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం చిత్తడిచిత్తడిగా ఉండడంతో…రెండుజట్ల ఆటగాళ్లు ఇన్ డోర్ స్టేడియంలో ప్రాక్టీస్ కే పరిమితమయ్యారు.
అయితే…రెండుజట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

మ్యాచ్ మొత్తం టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుకావడంతో…స్టేడియం కిటకటలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్2, పాక్ 6…

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం మాజీ చాంపియన్లు భారత్ 2, పాక్ 6 ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. అయితే…ర్యాంకుల పరంగా నాలుగు స్థానాలు తేడా ఉన్నా…పోటీ మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్..ఇప్పటి వరకూ ఆడిన మూడుమ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించడం ద్వారా..5పాయింట్లతో ఉంది.

మరోవైపు…పాక్ జట్టు మాత్రం నాలుగురౌండ్లలో ఓ గెలుపు, రెండు పరాజయాల ద్వారా వచ్చిన 3 పాయింట్లతో గందరగోళంలో చిక్కుకొంది.

ప్రపంచకప్ లో భారత్ దే పైచేయి…

భారత-పాక్ జట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…ఓవరాల్ గా పాక్ దే పైచేయిగా ఉన్నా…ప్రపంచకప్ లో మాత్రమే భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది.

గత 11 ప్రపంచకప్ టోర్నీలలో భాగంగా ఈ రెండుజట్లు తలపడిన ఆరుకు ఆరు మ్యాచ్ ల్లో భారతజట్టే విజేతగా నిలిచింది. అంతేకాదు…ఏడో విజయానికి.. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ఉరకలేస్తోంది.

హాట్ ఫేవరెట్ భారత్…

ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ లో పవర్ ఫుల్ భారతజట్టే హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్…మొత్తం మూడు విభాగాలలోనూ.. పాక్ కంటే భారతజట్టే అత్యంత సమతూకంతో మెరుగైన జట్టుగా కనిపిస్తోంది.

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు లో రోహిత్ శర్మ, రాహుల్, ధోనీ, హార్ధిక్ పాండ్యా లాంటి ప్రపంచ మేటి బ్యాట్స్ మన్, మహ్మద్ షమీ, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లాంటి పేసర్లు, జడేజా, కుల్దీప్, చాహల్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు.

ఇక…పాక్ జట్టు బ్యాటింగ్ మాత్రం ఇమాముల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ లాంటి యువఆటగాళ్ళ పైనే ఆధారపడి ఉంది.
బౌలింగ్ లో మహ్మద్ అమీర్ ఒక్కడే నిలకడరాణిస్తున్నాడు.

యుద్ధంకాదు…క్రికెట్ పోరాటమే..

భారత, పాక్ జట్లు పోటీకి దిగితే దానిని ఓ యుద్ధంలా చిత్రించి పబ్బం గడుపుకోడం మీడియాకు ఓ అలవాటుగా మారిపోయిందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

ఇటు భారత్, అటు పాక్ కెప్టెన్లు మాత్రం…తాము ఓ మ్యాచ్ లో ఆడుతున్నామన్న భావనతోనే ఉన్నామని, అత్యుత్తమంగా రాణించడం ద్వారా అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తామని ప్రకటించారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వరుణుడు కరుణ పైనే మ్యాచ్ జరిగేది లేనిది ఆధారపడి ఉంది.

First Published:  16 Jun 2019 2:30 AM IST
Next Story