Telugu Global
NEWS

సచిన్ తర్వాతి స్థానంలో ధోనీ

అత్యధిక వన్డేలు ఆడిన భారత రెండో క్రికెటర్ ప్రపంచకప్ లో పాక్ తో మ్యాచ్ తో 344 వన్డేల ధోనీ భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ..అత్యధిక వన్డే మ్యాచ్ లు ఆడిన రెండో భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా…రాహుల్ ద్రావిడ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. 463 వన్డేలతో అగ్రస్థానంలో నిలిచిన మాస్టర్ […]

సచిన్ తర్వాతి స్థానంలో ధోనీ
X
  • అత్యధిక వన్డేలు ఆడిన భారత రెండో క్రికెటర్
  • ప్రపంచకప్ లో పాక్ తో మ్యాచ్ తో 344 వన్డేల ధోనీ

భారత మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ..అత్యధిక వన్డే మ్యాచ్ లు ఆడిన రెండో భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా…రాహుల్ ద్రావిడ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.

463 వన్డేలతో అగ్రస్థానంలో నిలిచిన మాస్టర్ సచిన్ తర్వాతి స్థానంలో ధోనీ నిలిచాడు.

భారత వన్డే చరిత్రలో ద్రావిడ్, అజరుద్దీన్, ధోనీ తలో 344 వన్డేలు చొప్పున ఆడారు. సౌరవ్ గంగూలీ 311 వన్డేలతో ఉన్నాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో మిగిలిన ఐదు లీగ్ మ్యాచ్ లు ఆడటం ద్వారా..ధోనీ ఆడిన వన్డేల సంఖ్య 349కు చేరనుంది.

First Published:  16 Jun 2019 3:38 PM IST
Next Story