Telugu Global
NEWS

పేపర్లలో హెడ్డింగ్ లు మారుతున్నాయి.... కానీ మెడలో కండువా అదే...!

బీజేపీలోకి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ? టీఆర్ఎస్‌లోకి కోమ‌టిరెడ్డి సోద‌రులు ? టీజేఎస్‌లోకి కోమ‌టిరెడ్డి బ్యాచ్ ? గులాబీ చెంత‌కు న‌ల్గొండ బ్ర‌ద‌ర్స్ ? హ‌రీష్‌రావుతో కీల‌క మంత‌నాలు ? పీసీసీ అధ్య‌క్షుడిగా కోమ‌టిరెడ్డి ? …. ఇలాంటి బ్రేకింగ్స్ రెండేళ్లుగా చూస్తున్నాం. పేప‌ర్ల‌లో హెడ్డింగ్‌లు చూశాం. తెలంగాణ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వెళ్లాయి. టీఆర్ఎస్ మ‌ళ్లీ గెలిచింది. అధికారంలోకి వ‌చ్చింది. కానీ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మాత్రం పార్టీ మార‌లేదు. అదే కాంగ్రెస్‌లో ఉన్నారు. ఒక బ్ర‌ద‌ర్ ఎమ్మెల్యే అయ్యారు. […]

పేపర్లలో హెడ్డింగ్ లు మారుతున్నాయి.... కానీ మెడలో కండువా అదే...!
X
  • బీజేపీలోకి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ?
  • టీఆర్ఎస్‌లోకి కోమ‌టిరెడ్డి సోద‌రులు ?
  • టీజేఎస్‌లోకి కోమ‌టిరెడ్డి బ్యాచ్ ?
  • గులాబీ చెంత‌కు న‌ల్గొండ బ్ర‌ద‌ర్స్ ?
  • హ‌రీష్‌రావుతో కీల‌క మంత‌నాలు ?
  • పీసీసీ అధ్య‌క్షుడిగా కోమ‌టిరెడ్డి ?

…. ఇలాంటి బ్రేకింగ్స్ రెండేళ్లుగా చూస్తున్నాం. పేప‌ర్ల‌లో హెడ్డింగ్‌లు చూశాం. తెలంగాణ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వెళ్లాయి. టీఆర్ఎస్ మ‌ళ్లీ గెలిచింది. అధికారంలోకి వ‌చ్చింది. కానీ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మాత్రం పార్టీ మార‌లేదు. అదే కాంగ్రెస్‌లో ఉన్నారు. ఒక బ్ర‌ద‌ర్ ఎమ్మెల్యే అయ్యారు. మ‌రో బ్ర‌ద‌ర్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఆయ‌న ఎంపీ అయ్యారు. కానీ వీరు మాత్రం పార్టీ మారింది లేదు. అదే కాంగ్రెస్ కండువా భుజాన వేసుకుని తిరుగుతున్నారు.

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఈ సారైనా నిజంగా పార్టీ మారుతారా? అనేది ఇప్పుడు అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌. టీఆర్ఎస్‌లోకి వెళ‌తామ‌ని ఎన్నిక‌ల ముందు లీకుల మీద లీకులు ఇచ్చారు. హ‌రీష్‌రావుతో క‌లిసి మంత‌నాలు జ‌రిపిన‌ట్లు వార్త‌లు రాశారు. కానీ పార్టీ మారింది మాత్రం లేదు. న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే లింగ‌య్య‌ను మాత్రం గులాబీ గూటికి చేర్చారు. త‌మ కాంట్రాక్టుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారన్న ప్రచారమూ జరిగింది.

అంత‌కుముందు టీజేఎస్‌లో చేర‌తామ‌ని..త‌మ‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని కోదండ‌రాంతో మంత‌నాలు జ‌రిపార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే కోదండ‌రాం ఒప్పుకోక‌పోవ‌డంతో అక్క‌డ పుల్‌స్టాప్ పడింది. ఎన్నిక‌ల ముందు పీసీసీ అధ్య‌క్షుణ్ణి మారుస్తార‌ని…. త‌మ‌కు పీసీసీ వ‌స్తుంద‌ని హ‌ల్‌చ‌ల్ చేశారు. కానీ ఆ అధ్య‌క్ష ముచ్చ‌ట తీర‌లేదు.

ఇప్పుడు తాజాగా బీజేపీలోకి కోమ‌టిరెడ్డి సోద‌రులు వెళ‌తార‌ని ప్రచారం మొద‌లైంది. రాంమాధ‌వ్‌తో రాజ‌గోపాల్‌రెడ్డి మంత‌నాలు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అటు వెంక‌ట‌రెడ్డి మాత్రం రాంమాధ‌వ్ ఎవ‌రో నాకు తెలియ‌దు…. ఆయ‌న్ని ఇంతవ‌ర‌కూ చూడ‌లేద‌ని స్టేట్‌మెంట్స్ ఇస్తారు. ఇటు రాజ‌గోపాల్ రెడ్డి మాత్రం తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కి బీజేపీ మాత్రమే ప్ర‌త్నామ్నాయ‌మ‌ని సెల‌విస్తారు.

మొత్తానికి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయం ఏంటో అంతుబట్ట‌డం లేదు. కేవ‌లం కాంట్రాక్టులు, త‌మ ప‌నుల కోసమే ఇలాంటి స్టేట్‌మెంట్స్‌తో కోమ‌టిరెడ్డి సోద‌రులు రాజ‌కీయం న‌డిపిస్తున్నారా? లేక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆశిస్తున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో మొద‌ల‌య్యాయి. ఈ సారైనా కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ నిజంగానే కండువా మారుస్తారా? లేదా? అనేది చూడాలి.

First Published:  16 Jun 2019 6:28 AM IST
Next Story