బిగ్ బాస్ 3 ప్రోమో విడుదల
తెలుగు టీవీ ఇండస్ట్రీ లో ఎన్ని షో లు వచ్చినా…. బిగ్ బాస్ షో కి ఉన్నంత ఆదరణ ఇంకో షో కి లేదు. షో మొదటి సీజన్ లో నే అన్ని ఎపిసోడ్స్ కి మంచి రేటింగ్స్ రావడం తో స్టార్ మా వ్యాల్యూ మార్కెట్ లో అమాంతం పెరిగింది అని చెప్పుకోవచ్చు. మొదటి రెండు సీజన్లు మంచిగా నే ఎంటర్ టైన్ చేసినా కానీ మూడో సీజన్ పైన మాత్రం ఆది నుండి అనేక […]

తెలుగు టీవీ ఇండస్ట్రీ లో ఎన్ని షో లు వచ్చినా…. బిగ్ బాస్ షో కి ఉన్నంత ఆదరణ ఇంకో షో కి లేదు. షో మొదటి సీజన్ లో నే అన్ని ఎపిసోడ్స్ కి మంచి రేటింగ్స్ రావడం తో స్టార్ మా వ్యాల్యూ మార్కెట్ లో అమాంతం పెరిగింది అని చెప్పుకోవచ్చు.
మొదటి రెండు సీజన్లు మంచిగా నే ఎంటర్ టైన్ చేసినా కానీ మూడో సీజన్ పైన మాత్రం ఆది నుండి అనేక అనుమానాలు తలెత్తడం మొదలయ్యాయి. నాని హోస్ట్ గా చేయను అని చెప్పడంతో ఈ మూడో సీజన్ కి హోస్ట్ గా ఎవరు ఉంటారు అనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది.
అయితే స్టార్ మా యాజమాన్యం, బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షో గురించి ప్రకటన చేస్తారు అని ఎదురు చూస్తున్న సందర్భం లో నేడు ఛానెల్ వారు షో కి సంబంధించి మొదటి అప్డేట్ ని విడుదల చేశారు.
బిగ్ బాస్ 3 కి సంబందించిన ప్రోమో ని నిర్వాహకులు విడుదల చేశారు. స్టార్ మా సోషల్ మీడియా పేజెస్ లో ఈ ప్రోమో ప్రస్తుతం ఉంది. త్వరలో షో మొదలవబోతుంది అని మాత్రమే చెప్పారు.
అయితే నాగార్జున ఈ షో ని హోస్ట్ చేయనున్నారు అనే టాక్ వినిపిస్తుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.