Telugu Global
NEWS

నీ వ‌ల్లే పందాలు క‌ట్టాం... కోట్లు పోగొట్టుకున్నాం... చంద్ర‌బాబుపై త‌మ్ముళ్ల ఫైర్ !

తెలుగుదేశం విస్తృత స్థాయి స‌మావేశం హాట్‌హాట్‌గా సాగింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై నేరుగా కొంద‌రు త‌మ్ముళ్లు విసుర్లు విసిరారు. మ‌రికొంద‌రు తీవ్ర నిర‌స‌న గ‌ళం వినిపించారు. పూర్తిగా పార్టీని చంద్ర‌బాబు,లోకేష్ చూసుకుంటార‌నే ధీమాతో నేత‌లు ఎవ‌రూ కూడా పార్టీని చూసుకోలేద‌ని మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. అశోక్‌గ‌జ‌ప‌తిరాజు లాంటి టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కూడా చంద్ర‌బాబుకు గ‌ట్టిగానే క్లాస్ పీకార‌ని తెలుస్తోంది. టెలికాన్ఫ‌రెన్స్ వ‌ల్ల ఎలాంటి లాభం లేద‌ని…అక్క‌డ జ‌రిగేది అంతా ట్రాష్ అని కొట్టిపారేశారని చెబుతున్నారు. పార్టీ […]

నీ వ‌ల్లే పందాలు క‌ట్టాం...  కోట్లు పోగొట్టుకున్నాం...  చంద్ర‌బాబుపై త‌మ్ముళ్ల ఫైర్ !
X

తెలుగుదేశం విస్తృత స్థాయి స‌మావేశం హాట్‌హాట్‌గా సాగింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై నేరుగా కొంద‌రు త‌మ్ముళ్లు విసుర్లు విసిరారు. మ‌రికొంద‌రు తీవ్ర నిర‌స‌న గ‌ళం వినిపించారు. పూర్తిగా పార్టీని చంద్ర‌బాబు,లోకేష్ చూసుకుంటార‌నే ధీమాతో నేత‌లు ఎవ‌రూ కూడా పార్టీని చూసుకోలేద‌ని మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు.

అశోక్‌గ‌జ‌ప‌తిరాజు లాంటి టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కూడా చంద్ర‌బాబుకు గ‌ట్టిగానే క్లాస్ పీకార‌ని తెలుస్తోంది. టెలికాన్ఫ‌రెన్స్ వ‌ల్ల ఎలాంటి లాభం లేద‌ని…అక్క‌డ జ‌రిగేది అంతా ట్రాష్ అని కొట్టిపారేశారని చెబుతున్నారు. పార్టీ ఓట‌మికి మీ వైఖ‌రే కార‌ణ‌మ‌ని కుండ‌బ‌ద్దలు కొట్టారట.

ఎన్నిక‌ల త‌ర్వాత మీరు చెప్పిన దాని వ‌ల్లే దాదాపు 200 కోట్ల రూపాయ‌ల పందాలు క‌ట్టాం…. ఇప్పుడు మాకు దిక్కెవ‌ర‌ని క‌డ‌ప జిల్లా నేత చెంగ‌ల్రాయుడు ప్ర‌శ్నించారని సమాచారం. మీరు, మీ ల‌గ‌డ‌పాటి, మీ ఏబీఎన్ చాన‌ల్ వ‌ల్లే…. పందాలు క‌ట్టి…తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని వాపోయారు. మీరు 110 సీట్లు వ‌స్తాయ‌ని చెప్ప‌డం వ‌ల్లే పందాలు క‌ట్టామ‌ని..దీన్ని మీరు ఎలా స‌మ‌ర్థించ‌కుంటార‌ని చెంగల్రాయుడు ఈ సమావేశంలో నిల‌దీసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవ‌లే పార్టీలో చేరిన అధికార ప్ర‌తినిధి దివ్య‌వాణి కూడా గ‌ట్టిగానే క్లాస్ పీకార‌ని తెలుస్తోంది. జ‌య‌సుధ చెప్పింది… టీడీపీలోకి వెళ్లొద్ద‌ని…. కానీ ఆమె చెప్పినా విన‌కుండా వ‌స్తే జ‌రిగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌ని వాపోయింద‌ట‌. ఇక్క‌డ ఓ సిస్ట‌మ్ లేదు… పాడూ లేద‌ని దుమ్మెత్తి పోసింద‌ట‌. అంతేకాదు…. ఇక్క‌డ చంద్ర‌బాబుకు భజన చేసే వ్యక్తులు చాలామంది పార్టీని త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని చెప్పింద‌ట‌. అంతేకాదు తాము చెప్పింది అధినేత వ‌ర‌కు చేర‌డం లేద‌ని వాపోయార‌ట‌.

కోడెల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలంతా కోడెల టాక్స్ గురించి నాకు చెప్పారని, అలాంటి వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇస్తారని నిలదీశారని, ఆ విషయాన్ని నేను పెద్దలకు చెప్పిన ఫలితం లేకపోయిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేసిందట.

రియల్ టైం గవర్నెన్స్ నివేదికలు కొంప ముంచాయ‌ని మ‌రికొంత మంది నేత‌లు చెప్పిన‌ట్లు తెలిసింది. గతంలో లాగానే …ఇప్పుడూ అధికారులను పక్కన పెట్టుకోవడం వల్లనే కొంప మునిగిందని ఎమ్మెల్సీ శ్రీనివాసులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని స‌మాచారం.

First Published:  15 Jun 2019 1:20 AM IST
Next Story