సుజనా దారెటు !
ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశంలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇవి మరో రూపం దాల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులను అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. లాస్ట్ మినిట్ వరకూ బీజేపీతో దోస్తీ కంటిన్యూ చేసేందుకు ప్రయత్నించారు. కానీ టీడీపీ నేతలు, ముఖ్యంగా లోకేష్ ఒత్తిడి వల్ల సుజనా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా సుజనా చౌదరి బీజేపీతో దోస్తానా కొనసాగించారు. […]
ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశంలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇవి మరో రూపం దాల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులను అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. లాస్ట్ మినిట్ వరకూ బీజేపీతో దోస్తీ కంటిన్యూ చేసేందుకు ప్రయత్నించారు. కానీ టీడీపీ నేతలు, ముఖ్యంగా లోకేష్ ఒత్తిడి వల్ల సుజనా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే ఆ తర్వాత కూడా సుజనా చౌదరి బీజేపీతో దోస్తానా కొనసాగించారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు పదవిలో లేరు. దీంతో అప్పటిదాకా పదవిలో ఉండడం వల్ల పక్కన పెట్టిన కేసులు ఇప్పుడు చుట్టుముట్టాయి. మరోవైపు కాపాడే నేతలు లేరు. దీంతో ఏంచేయాలని ఆయన తీవ్రంగా మథనపడుతున్నారని తెలుస్తోంది.
లోకేష్ నాయకత్వాన్ని ఫస్ట్ నుంచి సుజనా చౌదరి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీ మీటింగ్ లలో బీజేపీతో దోస్తీ కటీఫ్ విషయం వచ్చిన ప్రతిసారి వద్దని సుజనా చెప్పేవారట. అయితే లోకేష్ మాత్రం కటీఫ్ చేసుకోవాల్సిందే అని అనేవారట. అక్కడి నుంచి వారి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు.
మరోవైపు ఇప్పుడు సుజనా చౌదరి మాత్రం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. అయితే అక్కడికి వెళ్లని ఆయన… హైదరాబాద్‌లో ఏపీ టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. టీడీపీలో ఉండాలా? లేక పార్టీ మారాలా? అనే అంశంపై వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసుల నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారడమే శరణ్యమని నిర్ణయానికి వచ్చారట. అందుకే తనతో కలిసి వచ్చే నేతలతో… ఈయన బీజేపీలోకి జంప్ అవుతారని ప్రచారం మాత్రం ఇప్పుడు జోరుగా నడుస్తోంది.