సాహో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్నారు
నిన్న రిలీజైన సాహో టీజర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. టీజర్ లో విజువల్స్ ఎంతగా ఎట్రాక్ట్ చేశాయో, దానికిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైక్ చేసిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ టీజర్ కు గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినట్టు యూనిట్ ప్రకటించింది. కానీ […]
నిన్న రిలీజైన సాహో టీజర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. టీజర్ లో విజువల్స్ ఎంతగా ఎట్రాక్ట్ చేశాయో, దానికిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైక్ చేసిన వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.
ఈ టీజర్ కు గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినట్టు యూనిట్ ప్రకటించింది. కానీ నిజానికి అది పూర్తిగా జిబ్రాన్ అందించిన ట్యూన్ కాదట. ఓ హాలీవుడ్ ఏజెన్సీ నుంచి భారీ మొత్తానికి దాన్ని కొన్నారట. అలా కొనుగోలు చేసిన బీజీఎంకు టీజర్ కు తగ్గట్టు జిబ్రాన్ కొన్ని మార్పులు చేశాడట.
గతంలో బాహుబలి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ సినిమా టీజర్ల కోసం ఓ కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకున్నారు. దాన్ని హాలీవుడ్ సినిమా నుంచి కాపీకొట్టారంటూ చాలామంది విమర్శించారు. కానీ ఓ హాలీవుడ్ ఏజెన్సీ నుంచి దాని హక్కులు తీసుకొని మరీ బాహుబలి టీజర్లు విడుదల చేశారు. ఇప్పుడు సాహోకు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారన్నమాట.
అన్నట్టు ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టీజర్ కు మాత్రమే పరిమితం కాదు. సినిమాలో కూడా కొన్ని పోర్షన్లలో ఈ ట్యూన్ వాడారట. ఒకవేళ వాడకపోయినా, తాజాగా వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాతైనా సినిమాలో ఈ స్కోర్ ను తప్పకుండా పెడతారు.