Telugu Global
NEWS

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం

భారీవర్షంతో నాటింగ్ హామ్ మ్యాచ్ రద్దు చెరో పాయింట్ పంచుకొన్న భారత్,న్యూజిలాండ్ ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య నాటింగ్ హామ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ కు వానదెబ్బ తగిలింది. ఒక్కబంతి పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దీంతో రెండుజట్లూ చెరోపాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. వాతావరణశాఖ కొద్దిరోజుల క్రితమే …వానముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దానికితోడు గత కొద్దిరోజులుగా కురిసిన భారీవర్షాలతో పాటు.. మ్యాచ్ జరగాల్సిన రోజున సైతం విడవకుండా వానపడుతూనే ఉండడంతో…మ్యాచ్ ను […]

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం
X
  • భారీవర్షంతో నాటింగ్ హామ్ మ్యాచ్ రద్దు
  • చెరో పాయింట్ పంచుకొన్న భారత్,న్యూజిలాండ్

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య నాటింగ్ హామ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ కు వానదెబ్బ తగిలింది.

ఒక్కబంతి పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దీంతో రెండుజట్లూ చెరోపాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. వాతావరణశాఖ కొద్దిరోజుల క్రితమే …వానముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దానికితోడు గత కొద్దిరోజులుగా కురిసిన భారీవర్షాలతో పాటు..
మ్యాచ్ జరగాల్సిన రోజున సైతం విడవకుండా వానపడుతూనే ఉండడంతో…మ్యాచ్ ను రద్దు చేయకతప్పలేదని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

దీంతో రెండుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

న్యూజిలాండ్ కు 7, భారత్ 5 పాయింట్లు..

వానదెబ్బతో మ్యాచ్ రద్దు కావడంతో…రెండుజట్లకు చెరో పాయింట్ ఇచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ ..నాలుగుమ్యాచ్ ల్లో 7 పాయింట్లు సాధించింది.

మరోవైపు మాజీ చాంపియన్ భారత్ మూడుమ్యాచ్ ల్లో ఐదుపాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాను, రెండోరౌండ్లో పవర్ ఫుల్ ఆస్ట్రేలియాను చిత్తు చేయడం ద్వారా..వరుసగా మూడో విజయానికి గురిపెట్టిన విరాట్ సేన ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు.

నాలుగు మ్యాచ్ లు రద్దు..

గత రెండువారాలుగా జరుగుతున్న ప్రపంచకప్ మొదటి 18 మ్యాచ్ ల్లో…నాలుగు మ్యాచ్ లు..వానదెబ్బతో రద్దయ్యాయి.
శ్రీలంక జట్టు ఆడాల్సిన రెండుమ్యాచ్ లకూ వానదెబ్బ తగిలింది. వెస్టిండీస్, పాకిస్థాన్,సౌతాఫ్రికా జట్లు సైతం వర్షం కారణంగా మ్యాచ్ ల రద్దుతో ఒక్కో పాయింటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పాక్ తో భారత్ సూపర్ సండే ఫైట్..

ప్రపంచ రెండోర్యాంకర్ భారత్ తన నాలుగో రౌండ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ సూపర్ డూపర్ ఫైట్ కు భారీసంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు.

First Published:  14 Jun 2019 2:09 AM IST
Next Story