టీడీపీ భేటీకి వియ్యంకులు డుమ్మా !
తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం అది. ఎన్నికల తర్వాత చంద్రబాబు నిర్వహిస్తున్న రెండో సమావేశం. కానీ ఆ మీటింగ్‌కు కీలక నేతలు డుమ్మా కొట్టారు. ఒక్కరు కాదు… ఇద్దరు కాదు…. డజన్‌కు పైగా కీలక నేతలు, మాజీ మంత్రులు ఈ సమావేశానికి రాలేదు. టీడీపీలో వియ్యంకులు, మాజీమంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావు ఈ సమావేశానికి రాలేదు. నిన్నటి వరకూ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస రావు అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇవాళ మాత్రం ఈ సమావేశానికి రాలేదు. […]
తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం అది. ఎన్నికల తర్వాత చంద్రబాబు నిర్వహిస్తున్న రెండో సమావేశం. కానీ ఆ మీటింగ్‌కు కీలక నేతలు డుమ్మా కొట్టారు. ఒక్కరు కాదు… ఇద్దరు కాదు…. డజన్‌కు పైగా కీలక నేతలు, మాజీ మంత్రులు ఈ సమావేశానికి రాలేదు.
టీడీపీలో వియ్యంకులు, మాజీమంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావు ఈ సమావేశానికి రాలేదు. నిన్నటి వరకూ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస రావు అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇవాళ మాత్రం ఈ సమావేశానికి రాలేదు. అంతేకాకుండా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు, అమర్‌నాథ్ రెడ్డి, పితాని సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు కూడా కరకట్ట వైపు కన్నెత్తి చూడలేదు.
దీంతో పాటు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమావేశానికి రాలేదు. చిత్తశుద్ధి లేని పూజలు… చంద్రబాబు సమావేశాలు కూడా ఒకటే అని టీడీపీ నేతలు వాపోతున్నారు.
ఏదో మొక్కుబడిగా సమావేశాలు పెట్టి…రివ్యూ చేశామని చెప్పుకుని మమా అని చంద్రబాబు అనిపిస్తారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. చంద్రబాబు వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని తెలుగు తమ్ముళ్లు సమావేశం బయట చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ సమావేశం హాట్ హాట్‌గా సాగింది.