Telugu Global
NEWS

ఏపీలో దేశం "గోపి"లు 11మంది..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త చర్చ మొదలైంది. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ… శాసనసభలో 23 మందిని, లోక్ సభ కు ముగ్గురిని మాత్రమే గెలిపించుకుంది. అయితే ఇప్పుడు శాసన సభ్యుల్లో కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలోనే ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గోడ మీద పిల్లులు.. అదే గోపిలు ఎవరా అన్నది చర్చగా మారింది. గురువారం […]

ఏపీలో దేశం గోపిలు 11మంది..?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త చర్చ మొదలైంది. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ… శాసనసభలో 23 మందిని, లోక్ సభ కు ముగ్గురిని మాత్రమే గెలిపించుకుంది.

అయితే ఇప్పుడు శాసన సభ్యుల్లో కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలోనే ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గోడ మీద పిల్లులు.. అదే గోపిలు ఎవరా అన్నది చర్చగా మారింది.

గురువారం ఉదయం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి గోడదూకే వారు చాలా మందే ఉన్నారు అంటూ ప్రకటించిన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల లోనూ ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ గోపిలు ఎవరో పేర్లు బయటకు రాలేదు కానీ సంఖ్య మాత్రం వెల్లడైంది.

తెలుగుదేశం పార్టీ నుంచి ఎనిమిది మంది శాసనసభ్యులు, ముగ్గురు శాసనమండలి సభ్యులు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ఓ చానల్ లో జరిగిన చర్చాగోష్టిలో అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీథర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ చర్చా గోష్టిలోనే తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్యను వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఇక మారరని, పార్టీకి భవిష్యత్తు ఉండదనే ఆందోళన చెందుతున్న ఎనిమిది మంది తెలుగుదేశం శాసనసభ్యులు, ముగ్గురు శాసన మండలి సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు శ్రీథర్ రెడ్డి. ఇద్దరు ఎమ్మెల్యేలు తనతోనే నేరుగా మాట్లాడారని, మిగిలిన వారు పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

తనతో చర్చలు జరిపిన వారు కానీ, అధిష్టానంతో టచ్ లో ఉన్నవారు కానీ ఎవరో తాను వెల్లడించనని, అది రాజకీయ నైతికత కాదని శ్రీథర్ రెడ్డి స్పష్టం చేశారు. తమతో టచ్ లో ఉన్న వారిలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులలో బుచ్చయ్య చౌదరి మాత్రం లేరని శ్రీథర్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేస్తేనే వారిని పార్టీలోకి తీసుకుంటామని తమ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, పార్టీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని శ్రీథర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ చర్చలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తమ శాసన సభ్యులు ఐదుగురు మిగిలినా తాము ప్రజల పక్షాన పోరాడతామని చెప్పడం కొసమెరుపు. తెలుగుదేశం పార్టీకి మిగిలే ఐదుగురు శాసనసభ్యులు ఎవరా? అనేది కొత్త చర్చగా మారింది.

First Published:  14 Jun 2019 12:08 AM GMT
Next Story