Telugu Global
Cinema & Entertainment

'గేమ్ ఓవర్' సినిమా రివ్యూ

రివ్యూ: గేమ్ ఓవర్ రేటింగ్‌: 2.75/5 తారాగణం: తాప్సి పన్ను, వినోదిని వైద్యనాధన్, అనీష్ కురువిల్ల, సంచన నటరాజన్, రమ్య సుబ్రహ్మణ్యం, పార్వతి టి తదితరులు సంగీతం: రోన్ ఈథాన్ యోహాన్ నిర్మాత: ఎస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర దర్శకత్వం: అశ్విన్ శరవణన్ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్న తాప్సి కేవలం పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరొకసారి తన సత్తా చాటడానికి మన ముందుకు వచ్చింది […]

గేమ్ ఓవర్ సినిమా రివ్యూ
X

రివ్యూ: గేమ్ ఓవర్
రేటింగ్‌: 2.75/5
తారాగణం: తాప్సి పన్ను, వినోదిని వైద్యనాధన్, అనీష్ కురువిల్ల, సంచన నటరాజన్, రమ్య సుబ్రహ్మణ్యం, పార్వతి టి తదితరులు
సంగీతం: రోన్ ఈథాన్ యోహాన్
నిర్మాత: ఎస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
దర్శకత్వం: అశ్విన్ శరవణన్

గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్న తాప్సి కేవలం పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరొకసారి తన సత్తా చాటడానికి మన ముందుకు వచ్చింది తాప్సి.

‘గేమ్ ఓవర్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది తాప్సి పన్ను. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక యువతిని దారుణంగా హత్య చేయడంతో సినిమా ఓపెన్ అవుతుంది. తరువాత స్వప్న (తాప్సి పన్ను) పాత్ర ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. స్వప్న ఒక గేమర్. సంవత్సరం క్రితం ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల ఆమెకు నిక్టోఫోబియా వస్తుంది. ఆ వ్యాధి వలన ఆమెకు చీకటంటే చాలా భయం ఏర్పడుతుంది. ప్యాక్ మాన్ గేమ్ లో తన స్కోర్ ని తానే బీట్ చేయాలని ని ప్రయత్నిస్తున్న స్వప్న తన కేర్ టేకర్ కలమ్మ (వినోదిని వైద్యనాధన్) తో ఒకే ఇంట్లో ఉంటుంది.

ఒకరోజు ఆమెకు ఆమె టాటూ వెనుక ఉన్న భయంకరమైన నిజం తెలుస్తుంది. మరోవైపు స్వప్న ని ఒక సీరియల్ కిల్లర్ చంపాలని అనుకుంటాడు. ఇంతకీ స్వప్న కి తెలిసిన నిజం ఏంటి? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? స్వప్న ని నిజంగానే చంపేశాడా? చివరికి కథ ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో కూడా పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రను పోషించిన తాప్సి అద్భుతంగా నటించింది. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తాప్సి పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించింది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలలో తాప్సీ నటన చాలా బాగుందని చెప్పవచ్చు. వినోదిని వైద్యనాథన్ కూడా తన పాత్రకు ప్రాణం పోశారు. వినోదిని వైద్యనాథన్ నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అనీష్ కురువిల్లా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. మానసిక వైద్యుడి పాత్రలో కనిపించిన అనీష్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాడు.

సంచన నటరాజన్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. రమ్య సుబ్రహ్మణ్యం చాలా సహజంగా నటించింది. పార్వతి కూడా చాలా బాగా నటించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు అశ్విని శరవణన్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథను అందించారు. సినిమా మొదటి నుంచి ఆఖరివరకు ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమాను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

అశ్విన్ శరవణన్ కథను నెరేట్ చేసిన విధానం కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలు మంచి నిర్మాణ విలువలను అందించారు.

రోన్ ఈథాన్ యోహన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకి ఏ వసంత్ అద్భుతమైన విజువల్స్ ను అందించారు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ చాలా బాగుంది.

బలాలు:

  • బలమైన కథ
  • మంచి నటీనటులు
  • చక్కని నేపధ్య సంగీతం

బలహీనతలు:

  • కొన్ని లౌడ్ సన్నివేశాలు
  • మొదటి హాఫ్ కొంచెం స్లో గా ఉండడం

ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయేవరకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా లోని మొదటి సన్నివేశమే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కథను ఎస్టాబ్లిష్ చేయడం, కారెక్టర్ లను పరిచయం చేయడమే సరిపోయింది కాబట్టి కొంచెం స్లో గా అనిపించింది.

సినిమా పూర్తయ్యేంత వరకూ…. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే రెండవ భాగం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. అనవసరమైన సన్నివేశాలు ఏమీ పెట్టకుండా దర్శకుడు సినిమాని చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ మాస్ ఆడియన్స్ కి సినిమా అంతగా నచ్చకపోవచ్చు. బి, సి సెంటర్ల కంటే ఏ సెంటర్లలో ఈ సినిమా కొంచెం బాగా ఆడే అవకాశాలు ఉన్నాయి. చివరగా ‘గేమ్ ఓవర్’ సినిమా చూడదగ్గ సినిమానే.

First Published:  14 Jun 2019 10:13 AM IST
Next Story