ఎన్నికల్లో ఓటమి పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్ని రోజుల తర్వాత శనివారం గుంటూరులో పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఇందులో ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరూ హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో ఆసక్తికరంగా మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామో ఇప్పటికీ అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఎప్పుడైనా ఓటమికి కారణాలు తెలుస్తాయని.. కానీ ఈసారి మాత్రం ఎలా ఓడిపోయామో తెలియడం […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్ని రోజుల తర్వాత శనివారం గుంటూరులో పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఇందులో ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరూ హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో ఆసక్తికరంగా మాట్లాడారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామో ఇప్పటికీ అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఎప్పుడైనా ఓటమికి కారణాలు తెలుస్తాయని.. కానీ ఈసారి మాత్రం ఎలా ఓడిపోయామో తెలియడం లేదని అన్నారు.
ఇక టీడీపీ ఓటమితో రాష్ట్రంలో పరిస్థితులు మారాయని వైసీపీ రెచ్చిపోతోందని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం… ఏకంగా 100 చోట్ల దాడులు జరిగాయని… 3 వారాల్లోనే ఇంత పెద్ద ఎత్తున దాడులు చోటుచేసుకున్నాయని.. ఇప్పుడు నేతలందరూ వారికి అండగా నిలవాలని చంద్రబాబు సూచించారు.
వచ్చే 2024 టార్గెట్ గా ముందుకెళ్లాలని చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ప్రత్యర్థి వైసీపీ దాడులను కాచుకొని పార్టీని పటిష్టం చేయాలని.. వైసీపీలో నాయకులు చేరకుండా భరోసా కల్పించాలని బాబు సూచించినట్టు సమాచారం.