కోపా అమెరికాకప్ సాకర్ ప్రారంభం
బ్రెజిల్ వేదికగా 2019 టోర్నీ షురూ కోపా కప్ కు ఐదోసారి బ్రెజిల్ ఆతిథ్యం ఎనిమిదిసార్లు కోపాకప్ విజేత బ్రెజిల్ 2007 తర్వాత కోపాకప్ నెగ్గని సాంబా టీమ్ లాటిన్ అమెరికన్ సాకర్ సంరంభం కోపా అమెరికాకప్-2019 టోర్నీకి బ్రెజిల్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. జులై 7 వరకూ జరిగే 12 జట్ల ఈ సమరంలో.. ఆతిథ్య బ్రెజిల్, రెండుసార్లు విజేత చిలీ, మాజీ చాంపియన్ అర్జెంటీనా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. తొమ్మిదోటైటిల్ కు బ్రెజిల్ గురి… […]
- బ్రెజిల్ వేదికగా 2019 టోర్నీ షురూ
- కోపా కప్ కు ఐదోసారి బ్రెజిల్ ఆతిథ్యం
- ఎనిమిదిసార్లు కోపాకప్ విజేత బ్రెజిల్
- 2007 తర్వాత కోపాకప్ నెగ్గని సాంబా టీమ్
లాటిన్ అమెరికన్ సాకర్ సంరంభం కోపా అమెరికాకప్-2019 టోర్నీకి బ్రెజిల్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. జులై 7 వరకూ జరిగే 12 జట్ల ఈ సమరంలో.. ఆతిథ్య బ్రెజిల్, రెండుసార్లు విజేత చిలీ, మాజీ చాంపియన్ అర్జెంటీనా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.
తొమ్మిదోటైటిల్ కు బ్రెజిల్ గురి…
ఫుట్ బాల్ కు మరోపేరు బ్రెజిల్. సాకర్ ను ఓ మతంలా భావించే బ్రెజిల్ ఐదోసారి కోపా అమెరికాకప్ కు వేదికగా నిలిచింది. బ్రెజిల్ గతంలో ఆతిథ్యమిచ్చిన నాలుగుసార్లు విజేతగా నిలిచింది.
బ్రెజిల్ గడ్డపై గతంలో 1919, 1922, 1949, 1989 టోర్నీలు నిర్వహించిన సమయంలో సాంబాజట్టే విజేతగా నిలిచింది. ప్రస్తుత టోర్నీలో సైతం.. బ్రెజిల్ జట్టే విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.
2007 తర్వాత కోపా కప్ నెగ్గని బ్రెజిల్ ఆలోటును ప్రస్తుత ఈ టోర్నీలో తీర్చుకోవాలని భావిస్తోంది.
నైమార్ లేకుండానే…
స్టార్ స్ట్రయికర్ నైమార్ లేకుండానే బ్రెజిల్ టైటిల్ వేటకు దిగుతోంది. నైమార్ లాంటి కీలక ఆటగాడు లేకున్నా…విజేతగా నిలిచే సత్తా తమకు ఉందని…మరో కీలక ఆటగాడు కస్మీరో ధీమాగా చెబుతున్నాడు.
టోర్నీలో నాలుగు గ్రూపులుగా తలపడుతున్న జట్లలో బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే, కొలంబియా, పెరూ, పరాగ్వే, వెనిజ్వేలా, ఈక్వెడార్, జపాన్, ఖతర్, లీవియా ఉన్నాయి.
గ్రూప్-బీలో అర్జెంటీనా…
స్టార్ స్ట్రయికర్ లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా గ్రూప్- బీ లీగ్ లో కొలంబియా, పరాగ్వే, ఖతర్ జట్లతో తలపడనుంది.