వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు.. ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం..!
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆ అధికారం ఊరికనే దక్కలేదు. గత 9 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ.. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. వారి మనసును ముందు గెల్చుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థో తెలుసుకోవడానికి.. క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందో గమనించడానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ పక్కా ప్రొఫెషనల్ కన్సల్టెంట్. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీకి, ఆ తర్వాత నితీష్ కుమార్‌కి […]
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆ అధికారం ఊరికనే దక్కలేదు. గత 9 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ.. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ.. వారి మనసును ముందు గెల్చుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థో తెలుసుకోవడానికి.. క్షేత్ర స్థాయిలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందో గమనించడానికి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు.
ప్రశాంత్ కిషోర్ పక్కా ప్రొఫెషనల్ కన్సల్టెంట్. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీకి, ఆ తర్వాత నితీష్ కుమార్‌కి కూడా ఆయన తన కంపెనీ అయిన ఐ-ప్యాక్ ద్వారా పని చేశారు. తాజాగా పీకే విజయం అంటే ఏపీలో వైసీపీ సాధించిందే. వైసీపీ విజయంలో పీకేది కూడా ప్రధాన పాత్రే. ఇప్పుడు చంద్రబాబు కళ్లు పీకేపై పడ్డాయి.
మొన్నటి ఎన్నికల ముందు ‘బీహార్ రౌడీలు’ అని సంబోధించిన చంద్రబాబుకు ఇప్పుడు అతనే కావాల్సి వచ్చింది…. టీడీపీ చరిత్రలో ఘోర ఓటమిని చూసిన బాబు మళ్లీ పార్టీ బలోపేతం కోసం ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సీఎన్ఎన్-న్యూస్ 18 సంస్థ వెల్లడించింది.
చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే సీనియర్ పార్టీ నాయకుడు ఈ ఒప్పందం విషయంలో కీలకంగా వ్యవహరించాడట. ఆయనే వెళ్లి ప్రశాంత్ కిషోర్‌తో మాట్లాడాడట. దీంతో పరిమిత కాలానికి టీడీపీ తరపున పని చేస్తానని పీకే కూడా చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే బెంగాల్‌లో మమత తరపున పని చేయడానికి పీకే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత చేసుకున్న ఒప్పందం చంద్రబాబుదే.
అయితే ఈ ఒప్పందం విలువ ఎంతనేది టీడీపీ వర్గాలు కానీ, ఐప్యాక్ సంస్థకాని వెల్లడించలేదు.