కాళేశ్వరం ఆహ్వానం.... జగన్‌కు ఇబ్బంది కానుందా?
తెలంగాణకు వరప్రదాయినిగా పిలవబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా అత్యధిక ఆయకట్టును స్థిరీకరించాలనేది కేసీఆర్ లక్ష్యం. మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించనుండటంతో ఆ మహోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలను కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్రతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా…. గత ఏపీ ప్రభుత్వం మాత్రం దాదాపు 5 కేసులు వేసింది. గోదావరి జాలాల వాటా విషయంలో వేసిన […]
తెలంగాణకు వరప్రదాయినిగా పిలవబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా అత్యధిక ఆయకట్టును స్థిరీకరించాలనేది కేసీఆర్ లక్ష్యం.
మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించనుండటంతో ఆ మహోత్సవానికి మహారాష్ట్ర, ఏపీ సీఎంలను కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్రతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా…. గత ఏపీ ప్రభుత్వం మాత్రం దాదాపు 5 కేసులు వేసింది.
గోదావరి జాలాల వాటా విషయంలో వేసిన ఈ కేసులు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టుతో కూడా ముడిపడి ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు… కానీ గత ఏపీ ప్రభుత్వం మాత్రం అభ్యంతరం చెప్పింది.
చంద్రబాబు హయాంలోనే ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదులు చేశారు. అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏపీకి రావాల్సిన గోదావరి నీటి వాటా రాదని వాదిస్తోంది. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత ద్వారా పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయించింది.
కేసీఆర్, చంద్రబాబు మధ్య వైరాన్ని పక్కన పెడితే…. ఆనాడు కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల పైన వేసిన కేసులు ఇంకా కోర్టుల్లోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు సదరు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ వెళ్తే ఏమవుతుంది? అని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కాళేశ్వరం మీద ఇప్పటికే అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ వెళితే అది ప్రజలపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంటుందా?. సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పినా సరే.. అంతర్ రాష్ట్ర వివాదాల్లో స్నేహం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనే వాదన ముందుకు తెస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటి వరకు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న జగన్ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. జగన్ వెళ్లకపోతే స్నేహ ధర్మం మరిచినట్లుగా ఒక వర్గం ప్రచారం చేసే అవకాశం ఉంది.
అదే సమయంలో జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తే ప్రతిపక్ష టీడీపీ అతనిపై ఆరోపణలు చేసే అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుంది. మరి ఇలాంటి స్థితిలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!