Telugu Global
International

మీ గగనతలం మాకు వద్దు.... పాకిస్తాన్ అనుమతిని తిరస్కరించిన మోడీ..!

భారత ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇవ్వాల్టి నుంచి రెండు రోజుల పాటు కిర్గిజిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సదస్సుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గర దారి అని చెప్పి పాకిస్తాన్ గగనతలం నుంచి అనుమతిని భారత అధికారులు కోరారు. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాని ఆ వెంటనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. భారత ప్రధాని మోడీని మా గగనతలం మీద నుంచి అనుమతి ఇస్తాము.. […]

మీ గగనతలం మాకు వద్దు.... పాకిస్తాన్ అనుమతిని తిరస్కరించిన మోడీ..!
X

భారత ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇవ్వాల్టి నుంచి రెండు రోజుల పాటు కిర్గిజిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సదస్సుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గర దారి అని చెప్పి పాకిస్తాన్ గగనతలం నుంచి అనుమతిని భారత అధికారులు కోరారు. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాని ఆ వెంటనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.

భారత ప్రధాని మోడీని మా గగనతలం మీద నుంచి అనుమతి ఇస్తాము.. అలాగే పాకిస్తాన్‌తో భారత దేశం శాంతి చర్చలకు సిద్దమవ్వాలని ఒక వ్యాఖ్య చేశారు.

అయితే, ఇటీవల కశ్మీర్‌లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేవలం విమాన మార్గానికి దారి ఇచ్చి దౌత్య సంబంధాల చర్చలు చేయాలని పాకిస్తాన్ భావించడంపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.

దీంతో ప్రధాని మోడీ తన విమాన మార్గాన్ని మార్చారు. ఢిల్లీ నుంచి ఇరాన్, ఒమన్ మీదుగా కిర్గిజిస్తాన్ వెళ్లారు. ఇది పాకిస్తాన్‌కు పెద్ద చెంపదెబ్బలాంటిదే. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే పక్కదేశ ప్రధానికి గగనతలాన్ని వదలడానికి షరతులు విధించడం భారత దేశానికి కూడా నచ్చలేదు. దీంతో ఇకపై పాకిస్తాన్ గగనతలాన్ని కావాలని అభ్యర్థించొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

భారతదేశం నుంచి పాక్ గగనతలం మీదగా వెళ్లే కమర్షియల్ విమానాలకు రెండు మార్గాలను మాత్రం పాక్ తెరిచి ఉంచింది.

First Published:  13 Jun 2019 1:40 AM IST
Next Story