ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు వైసీపీ నేతల దుర్మరణం
దారుణం జరిగింది. తమ ప్రియతమ నాయకుడు తమ్మినేని సీతారాం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఆముదాలవలస నుంచి వస్తున్న వైసిపీ నాయకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆముదాలవలసకు చెందిన ఇద్దరు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు పి.ఎల్.నాయుడు, పప్పల నారాయణ రావు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం తుని మండలం కొత్తూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆముదాలవలసకు […]
దారుణం జరిగింది. తమ ప్రియతమ నాయకుడు తమ్మినేని సీతారాం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఆముదాలవలస నుంచి వస్తున్న వైసిపీ నాయకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆముదాలవలసకు చెందిన ఇద్దరు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు పి.ఎల్.నాయుడు, పప్పల నారాయణ రావు మృతి చెందారు.
వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం తుని మండలం కొత్తూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆముదాలవలసకు చెందిన ఈ ఇద్దరు నాయకులు మరణించారు. ఆముదాలవలసలో బుధవారం సాయంత్రం బయలుదేరిన స్కార్పియో రాత్రి 2-30 గంటలకు తుని మండలంలోని కొత్తూరుకు చేరుకుంది. హఠాత్తుగా కారు టైరు పేలిపోవడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో ఆగి ఉన్న లారీని ఢీకోనడంతో ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో మరణించిన పి.ఎల్. నాయుడు, నారాయణ రావు స్పీకర్ గా నియమితులైన తమ్మినేని సీతారాంకు అత్యంత సన్నిహితులు. వారితో పాటు మరికొందరు కూడా తమ్మినేని సీతారాం స్పీకర్ గా ప్రమాణం చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆముదాల వలస నుంచి బయలు దేరారు. దురదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రయాణిస్తున్న స్కార్పియో ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తన సన్నిహితులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్ తమ్మినేని సీతారాం సంతాపం తెలిపారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఓ ప్రకటనలో తెలిపారు.