ప్రపంచకప్ ను వెంటాడుతున్న వర్షం
వరుసగా రెండోమ్యాచ్ రద్దు మొదటి 16 రౌండ్లలో మూడుమ్యాచ్ లు రద్దు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో వానపర్వం మొదలయ్యింది. బ్రిస్టల్ వేదికగా జరగాల్సినమ్యాచ్ ల్లో.. ఇప్పటికే రెండు రద్దుల పద్దులో చేరిపోయాయి. వానదెబ్బతో తమ మ్యాచ్ లు రద్దు కావడంతో…సౌతాఫ్రికా, విండీస్, పాకిస్థాన్,బంగ్లాదేశ్, శ్రీలంకజట్ల కెప్టెన్లు తీవ్రనిరాశకు గురయ్యారు. క్రికెట్ కు… రెయిన్ గాడ్ కు అవినాభావ సంబంధమే ఉంది. నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా అన్నట్లుగా వరుణదేవుడు… ఇంగ్లండ్ అండ్ వేల్స్ […]
- వరుసగా రెండోమ్యాచ్ రద్దు
- మొదటి 16 రౌండ్లలో మూడుమ్యాచ్ లు రద్దు
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో వానపర్వం మొదలయ్యింది. బ్రిస్టల్ వేదికగా జరగాల్సినమ్యాచ్ ల్లో.. ఇప్పటికే రెండు రద్దుల పద్దులో చేరిపోయాయి. వానదెబ్బతో తమ మ్యాచ్ లు రద్దు కావడంతో…సౌతాఫ్రికా, విండీస్, పాకిస్థాన్,బంగ్లాదేశ్, శ్రీలంకజట్ల కెప్టెన్లు తీవ్రనిరాశకు గురయ్యారు.
క్రికెట్ కు… రెయిన్ గాడ్ కు అవినాభావ సంబంధమే ఉంది. నువ్వెక్కడుంటే.. నేనక్కడుంటా అన్నట్లుగా వరుణదేవుడు… ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లను వెంటాడుతున్నాడు.
మ్యాచ్ వెంట మ్యాచ్ రద్దుకావడంతో అభిమానులు మాత్రమే కాదు.. వివిధ జట్ల కెప్టెన్లు సైతం ఏం చేయాలో పాలుపోక…పెదవివిరుస్తూ తమ నిరాశను బయటపెడుతున్నారు.
ప్రధానంగా బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన రెండురౌండ్ల మ్యాచ్ లు వానదెబ్బతో రద్దు కావడం…రెండుపాయింట్లు సాధించాల్సిన జట్లు చివరకు.. ఒక్కో పాయింటుతోనే సరిపెట్టుకోడం జరిగిపోతున్నాయి.
మొదటి రెండువారాలలో జరిగిన మొత్తం 16 మ్యాచ్ ల్లో …ఇప్పటికే మూడుమ్యాచ్ లు రద్దులపద్దులో చేరిపోయాయి.
సౌతాఫ్రికా- వెస్టిండీస్, శ్రీలంక- బంగ్లాదేశ్, పాకిస్థాన్- శ్రీలంకజట్ల మ్యాచ్ లు వానదెబ్బతో ఫలితం తేలకుండానే ముగిసిపోయాయి.
ప్రస్తుత ప్రపంచకప్ లో పడుతూ లేస్తూ వస్తున్న మాజీ చాంపియన్ శ్రీలంక ఆడాల్సిన రెండుమ్యాచ్ లకు వానదెబ్బ తగిలింది. నాలుగు పాయింట్లు సాధించగలమనుకొన్న శ్రీలంక చివరకు రెండుపాయింట్లతోనే సరిపెట్టుకోక తప్పలేదు.
వానదెబ్బతో మ్యాచ్ లు రద్దుకావడంతో…కొన్నిజట్ల సెమీస్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. మొత్తం 10జట్ల రౌండ్ రాబిన్ లీగ్ నుంచి..మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మాత్రమే సెమీఫైనల్స్ నాకౌట్ చేరే అవకాశం ఉంది.
ప్రస్తుత ప్రపంచకప్ మొదటి 16 రౌండ్లలో మూడు మ్యాచ్ లు రద్దయ్యితే…రానున్న రోజుల్లో జరిగే మిగిలిన 30రౌండ్ల లీగ్ మ్యాచ్ ల్లో మరెన్ని రద్దవుతాయన్నదే ఇక్కడి అసలు పాయింట్.
ప్రపంచకప్ మ్యాచ్ లకు రిజర్వ్ డే నిబంధన పాటించకపోడాన్ని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తప్పుపడుతున్నారు. ఒక వేళ రిజర్వ్ డే ఉండి ఉంటే.. వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగితే మరుసటిరోజున నిర్వహించే అవకాశంతో పాటు…ఫలితాన్ని రాబట్టే అవకాశం ఉండేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తమ అభిమానజట్ల మ్యాచ్ లు చూడటానికి వివిధ దేశాల నుంచి ఇంగ్లండ్, వేల్స్ దేశాలకు చేరిన వేలాదిమంది అభిమానుల ఉత్సాహంపై రెయిన్ గాడ్ మాత్రమే కాదు…నిర్వాహక సంఘం నిబంధనలు సైతం నీళ్లు చల్లుతున్నాయి.