Telugu Global
NEWS

జగన్‌ కోసం అమరావతికి వెళుతున్న కేసీఆర్

ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలో తెలిసిన కేసీఆర్ ఇప్పుడు కూడా అంతే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కృష్ణా నదిలో నీటి లభ్యత లేదు. ఉన్నదల్లా గోదావరియే.. దానిపై ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ దాన్ని దాదాపు పూర్తి చేశారు. జూన్ 21న ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. తర్వాత ఆషాడం కావడంతో ముందే ప్రారంభించాలని యోచిస్తున్నారు. అయితే గోదావరి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాన అడ్డుగా మొన్నటివరకు చంద్రబాబు ఉండేవాడు. కానీ ఇప్పుడు బాబు పోయి జగన్ […]

జగన్‌ కోసం అమరావతికి వెళుతున్న కేసీఆర్
X

ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలో తెలిసిన కేసీఆర్ ఇప్పుడు కూడా అంతే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కృష్ణా నదిలో నీటి లభ్యత లేదు. ఉన్నదల్లా గోదావరియే.. దానిపై ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ దాన్ని దాదాపు పూర్తి చేశారు. జూన్ 21న ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. తర్వాత ఆషాడం కావడంతో ముందే ప్రారంభించాలని యోచిస్తున్నారు.

అయితే గోదావరి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధాన అడ్డుగా మొన్నటివరకు చంద్రబాబు ఉండేవాడు. కానీ ఇప్పుడు బాబు పోయి జగన్ వచ్చారు. కేసీఆర్ తో తొలి నుంచి దోస్తీ కడుతున్నాడు. దీంతో ఇప్పుడు కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరానికి అడ్డుపడే వారే లేరు. అందుకే కేసీఆర్ కూడా దీన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు.

ఇప్పుడు జగన్ స్నేహగీతం ఆలపిస్తుండడంతో కేసీఆర్ కు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ కూడా ఈ విషయంలో కొర్రీలు వేయకుండా కేసీఆర్ ముందస్తు ప్లాన్ వేశాడు.

తాజాగా కాళేశ్వరం పథకం ప్రారంభోత్సవానికి జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. దీనికోసం స్వయంగా కేసీఆరే విజయవాడకు వెళ్లి జగన్ ను రమ్మని కోరనున్నారట. దీంతో జగన్ రావడం ఖాయం. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ఇలా కేసీఆర్ స్నేహగీతంతో పరిష్కరించుకుంటున్నారు.

తెలంగాణలో బలపడాలని అనుకుంటున్న బీజేపీ కూడా ఇప్పుడు కేసీఆర్, జగన్ ఒక్కటైతే ఏమీ చేయని పరిస్థితి నెలకొంటుంది. ఇలా కేసీఆర్ కాళేశ్వరంపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

First Published:  12 Jun 2019 11:47 AM IST
Next Story