Telugu Global
NEWS

మాజీ మంత్రి దేవినేని ఉమపై ఉచ్చు బిగుస్తోందా?

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమపై కేంద్ర ప్రభుత్వం ఉచ్చు బిగించనున్నదా..? ఆయన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవినీతిని బయట పెట్టే పనిలో పడిందా..? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని నీటిపారుదల విభాగం అధికార వర్గాలు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చేపట్టిన వివిధ నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగిందని, దీని వెనుక మంత్రి దేవినేని ఉమా హస్తం […]

మాజీ మంత్రి దేవినేని ఉమపై ఉచ్చు బిగుస్తోందా?
X

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమపై కేంద్ర ప్రభుత్వం ఉచ్చు బిగించనున్నదా..? ఆయన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవినీతిని బయట పెట్టే పనిలో పడిందా..? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని నీటిపారుదల విభాగం అధికార వర్గాలు.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చేపట్టిన వివిధ నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగిందని, దీని వెనుక మంత్రి దేవినేని ఉమా హస్తం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వివిధ ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిపై నిగ్గు తేలుస్తామని, అవసరమైతే రీ టెండర్లను ఆహ్వానిస్తామని ప్రకటించారు. దీంతో గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు పొందిన కాంట్రాక్టర్లతో పాటు ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రి, నీటి పారుదల శాఖ అధికారుల్లో కొందరు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిన తీరుపై కేంద్ర జల వసరుల శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టడానికి ముందే ఆయన మంత్రివర్గంలో కీలక శాఖను నిర్వహించిన దేవినేని ఉమా పై కన్ను వేయాలన్నది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు.

విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన కేశినేని నాని బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తల లో భాగంగా ఆయన నుంచి విలువైన సమాచారాన్ని సేకరించినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

దేవినేని ఉమ, లోక్ సభ సభ్యుడు కేశినేని నాని మధ్య రెండు దశాబ్దాలుగా వైరం ఉందని, మంత్రిగా దేవినేని ఉమా చేసిన అవినీతిపై ఇప్పటికే కేశినేని నాని కీలక సమాచారాన్ని కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు అందజేశారని సమాచారం.

First Published:  11 Jun 2019 11:53 PM GMT
Next Story