Telugu Global
NEWS

చంద్రబాబు తన స్థాయిని ఎక్కువ ఊహించుకున్నారు

“ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని ఎక్కువ ఉహించుకున్నారు. వాస్తవాలను చెప్పిన వాళ్లను దూరం పెట్టారు. ఇదే ఆయన ఓటమికి ప్రధాన కారణం” ఈ వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు. మంగళవారం రాత్రి ఓ తెలుగు ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణాలను వివరించారు […]

చంద్రబాబు తన స్థాయిని ఎక్కువ ఊహించుకున్నారు
X

“ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని ఎక్కువ ఉహించుకున్నారు. వాస్తవాలను చెప్పిన వాళ్లను దూరం పెట్టారు. ఇదే ఆయన ఓటమికి ప్రధాన కారణం” ఈ వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు.

మంగళవారం రాత్రి ఓ తెలుగు ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణాలను వివరించారు ఐవైఆర్ కృష్ణా రావు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అవినీతికి ఇచ్చిన ప్రాధాన్యం పాలనపై చూపించలేదని, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైంది అని ఆయన అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలు చేస్తున్న అరాచకాలను ప్రభుత్వ సలహాదారుగా తాను వివరించానని, ఆ సలహాలను చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారని కృష్ణారావు చెప్పారు.

జాతీయ స్థాయిలో తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం, జాతీయ పత్రికలలో తన సీనియారిటీపై కథనాలు రాయించుకోవడం వంటివి చంద్రబాబు నాయుడు చేసిన తప్పులుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు అతి విశ్వాసం ఆయన పార్టీ పరాజయానికి ఒక ప్రధాన కారణమైందని కృష్ణారావు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో కానీ, చంద్రబాబు నాయుడి పరాజయంలో కానీ తన పాత్ర ఇసుమంతైనా లేదని మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ రావు స్పష్టం చేశారు. వీరిద్దరిలో ఒకరు విజయం కోసం పోరాడితే.. మరొకరు పరాజయాన్ని కొని తెచ్చుకున్నారని కృష్ణా రావు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న బ్రాహ్మణుల ఉన్నతికి పాటు పడితే బాగుంటుందనే సూచన మాత్రం చేస్తానని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమిస్తే మాత్రం ఆ పదవిని స్వీకరిస్తానని ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ కి తనను చైర్మన్ గా నియమించి… మాట మాత్రమైనా చెప్పకుండా తొలగించడం తనను తీవ్రంగా కలచి వేసిందని కృష్ణా రావు ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  12 Jun 2019 2:46 AM IST
Next Story