Telugu Global
NEWS

ప్రపంచకప్ ఐదుగురు అత్యుత్తమ బౌలర్లు

ప్రపంచకప్ టాప్ త్రీ బౌలర్లలో మెక్ గ్రాత్, మురళీధరన్, అక్రం నాలుగున్నర దశాబ్దాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఎందరో గొప్పగొప్ప బౌలర్లున్నా…అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2019 ప్రపంచకప్ వరకూ జరిగిన మొత్తం 12 టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఏకైక బౌలర్.. ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ మాత్రమే. టాప్ బౌలర్ మెక్ గ్రాత్… ఐదుసార్లు ప్రపంచకప్ విజేత […]

ప్రపంచకప్ ఐదుగురు అత్యుత్తమ బౌలర్లు
X
  • ప్రపంచకప్ టాప్ త్రీ బౌలర్లలో మెక్ గ్రాత్, మురళీధరన్, అక్రం

నాలుగున్నర దశాబ్దాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఎందరో గొప్పగొప్ప బౌలర్లున్నా…అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు.

1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2019 ప్రపంచకప్ వరకూ జరిగిన మొత్తం 12 టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఏకైక బౌలర్.. ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ మాత్రమే.

టాప్ బౌలర్ మెక్ గ్రాత్…

ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా మూడుసార్లు విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించిన గ్లెన్ మెక్ గ్రాత్ కు అత్యధికంగా 71 వికెట్లు సాధించిన రికార్డు ఉంది.

గ్లెన్ మెక్ గ్రాత్ తన కెరియర్ లో మొత్తం 4 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొని 39 మ్యాచ్ ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.

రెండోస్థానంలో మురళీధరన్

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్నర్ రికార్డు..శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది. తన కెరియర్ లో ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భాగంగా 40 మ్యాచ్ లు ఆడిన మురళీధరన్ 68 వికెట్లు సాధించాడు.
గ్లెన్ మెక్ గ్రాత్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

మూడో స్థానంలో వసీం అక్రం…

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, లెప్టామ్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం…ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా, రెండో పేసర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

వసీం అక్రం తన కెరియర్ లో మొత్తం 5 ప్రపంచకప్ టోర్నీల్లో భాగంగా ఆడిన 38మ్యాచ్ ల్లో 55 వికెట్లు పడగొట్టాడు.

చమిందా వాస్…శ్రీలంక వికెట్ల బాస్…

శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ 4 ప్రపంచకప్ టోర్నీల్లో 31 మ్యాచ్ లు ఆడి ఏకంగా 49 వికెట్లు సాధించాడు.

భారత లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తన కెరియర్ లో ఆడిన 3ప్రపంచకప్ టోర్నీల్లో 23 మ్యాచ్ లు ఆడి…44 వికెట్లు పడగొట్టి సంయుక్త ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

భారత మరో ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ సైతం 4 ప్రపంచకప్ టోర్నీల్లో 34 మ్యాచ్ లు ఆడి 44 వికెట్లతో జహీర్ ఖాన్ సరసన నిలిచాడు.

మొత్తం ఆరుగురు టాప్ బౌలర్లలో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు, ఏకైక స్పిన్నర్ మాత్రమే ఉండటం విశేషం.

First Published:  11 Jun 2019 12:32 AM IST
Next Story