గిరీష్ కర్నాడ్ కన్నుమూత
ప్రముఖ నాటక రచయిత, సినీ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ ఇక లేరు. మహారాష్టలోని మథేరన్ లో 1938 మే 19న ఆయన జన్మించారు. గిరీష్ కర్నాడ్ పూర్తి పేరు గిరీష్ రఘునాథ్ కర్నాడ్. బెంగుళూరులో స్ధిరపడిన ఆయన అనేక నాటకాలను రచించారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, ప్రేమికుడు వంటి సినిమాలలో నటించారు. ఆనందభైరవి చిత్రంలో సాంప్రాదాయ నృత్యకారుడిగా […]
ప్రముఖ నాటక రచయిత, సినీ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ ఇక లేరు. మహారాష్టలోని మథేరన్ లో 1938 మే 19న ఆయన జన్మించారు. గిరీష్ కర్నాడ్ పూర్తి పేరు గిరీష్ రఘునాథ్ కర్నాడ్. బెంగుళూరులో స్ధిరపడిన ఆయన అనేక నాటకాలను రచించారు.
తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, ప్రేమికుడు వంటి సినిమాలలో నటించారు.
ఆనందభైరవి చిత్రంలో సాంప్రాదాయ నృత్యకారుడిగా ఆయన చేసిన నటన నభూతో నభవిష్యత్తు అని అనిపించుకుంది. కన్నడ నాటకరంగానికి గిరీష్ కర్నాడ్ ఆణిముత్యాల వంటి నాటకాలను అందించారు. సాహితీ రంగంలో ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం జ్ఞానపీఠ్ అవార్డును అందచేసింది. దీనితో పాటు పద్మశ్రీ, పద్మభూషన్ వంటి అవార్డులను అందుకున్నారు.
ఇటీవల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రచయితలు, మేధావులను అర్బన్ నక్సల్స్ గా పేర్కొనడాన్ని నిరసిస్తూ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి మెడలో అర్బన్ నక్సల్ అనే బోర్డును వేలాడదీసుకుని హాజరయ్యారు. ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
గిరీష్ కర్నాడ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలిపారు. గిరీష్ కర్నడ్ నటన, ఆయన రచనలు చిరస్దాయిగా మిగిలిపోతాయని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రధాని పేర్కొన్నారు.
గిరీష్ కర్నాడ్ నటించి మాల్గుడి డేస్ సీరియల్, ఉత్సవ్, పుకార్, స్వామి వంటి చిత్రాలు నటుడిగా గిరీష్ కర్నాడ్ ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. గిరీష్ కర్నడ్ నటించిన చివరి చిత్రం అప్నా దేశ్. కన్నడలో తీసిన ఈ సినిమా అగష్టు 26న విడుదల కానుంది.