Telugu Global
NEWS

రవిప్రకాష్‌ కేసు.... తీర్పు రేపటికి వాయిదా

ఫోర్జరీ కేసుతో పాటు, నిధుల మళ్ళింపు, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. గత ఐదు రోజులుగా రవిప్రకాష్‌ ను విచారించిన పోలీసులు దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దిల్‌జిత్‌సింగ్‌ అహుల్యా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది…. కోర్టు ముందు రవిప్రకాశ్‌ తరఫున వాదించిన అహుల్యాకు ఈ కేసుకు సంబంధించిన […]

రవిప్రకాష్‌ కేసు.... తీర్పు రేపటికి వాయిదా
X

ఫోర్జరీ కేసుతో పాటు, నిధుల మళ్ళింపు, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

గత ఐదు రోజులుగా రవిప్రకాష్‌ ను విచారించిన పోలీసులు దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు.

రవిప్రకాశ్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దిల్‌జిత్‌సింగ్‌ అహుల్యా వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది…. కోర్టు ముందు రవిప్రకాశ్‌ తరఫున వాదించిన అహుల్యాకు ఈ కేసుకు సంబంధించిన పలు ప్రశ్నలను సంధించారు.

రవిప్రకాష్‌ తన 9శాతం షేర్లలో 40 వేల షేర్లను 20 లక్షల రూపాయలకు శివాజీకి చెల్లించినట్లు తప్పుడు ధ్రువప్రతాలు సృష్టించారని…. ఫిబ్రవరి 2018న రవిప్రకాష్‌ ఎలాంటి షేర్లను శివాజీకి అమ్మలేదని… 40 వేల షేర్లను శివాజీకి 20 లక్షల రూపాయలకు అమ్మితే ఇద్దరూ ఐటీకి లెక్కలు చూపించాలి కదా? అని ప్రశ్నించారు ప్రభుత్వ లాయర్‌. ఇద్దరూ ఆర్థిక లావాదేవీలను ఐటీకి చూపించలేదని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ లాయర్‌.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రవిప్రకాష్‌ పోలీసుల ముందు హాజరై దర్యాప్తుకు సహకరించాల్సి ఉన్నా ఆయన దర్యాప్తుకు సహకరించడంలేదని, పైగా పోలీసుల పైనే బెదిరింపులకు దిగుతున్నాడని లాయర్లు వివరించారు…. తీర్పును రేపటికి వాయిదా వేశారు.

First Published:  10 Jun 2019 12:03 PM IST
Next Story